కొవిడ్ సామగ్రితో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఐరావత్ వియత్నాం సిటీ పోర్ట్కు చేరింది. 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ 300 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఈ నౌక భారత్ నుంచి వియత్నాంకు జల రవాణా చేసింది. సాగర్ మిషన్లో భాగంగా ఈ సామగ్రిని భారత్ ఆ దేశానికి పంపింది.
దేశీయంగా తయారైన తూర్పు నౌకాధళానికి చెందిన ఐరావత్ విశాఖ నుంచి ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి కొవిడ్ సామగ్రి చేరవేస్తోంది. జకార్తాలో 10 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించి.. అక్కడి నుంచి వియత్నాం చేరుకుంది.
ఇదీ చదవండి: IAS transfer: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు