ETV Bharat / city

అమరావతి వ్యాజ్యాలపై మే 3 నుంచి రోజువారీ విచారణ

ఏపీలోని అమరావతి సంబంధిత వ్యాజ్యాలపై ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. మే 3 నుంచి రోజువారీ విచారణ చేయనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

ap high court on amaravathi petitions
అమరావతి వ్యాజ్యాలపై మే 3 నుంచి రోజువారీ విచారణ
author img

By

Published : Mar 26, 2021, 9:04 PM IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై దాఖలైన వ్యాజ్యాలపై మే 3వ తేదీ నుంచి రోజువారీ విచారణ జరపాలని ఆ రాష్ష్ర హైకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. రాజధాని వ్యాజ్యాలపై ఏ విధంగా విచారణ చేపట్టాలనే అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది.

పిటిషనర్లు, ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలపై ధర్మాసనం ఆన్‌లైన్‌ ద్వారా విచారణ జరిపింది. అనంతరం మే 3 నుంచి రోజువారీ విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. మళ్లీ మొదటి నుంచి వాదనలు కొనసాగనున్నాయని ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

ఇవీచూడండి: 'సిద్దిపేట చాలా బాగుంది.. నా ప్రొద్దుటూరు ఇంత బాగాలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.