ETV Bharat / city

దీక్షలు, ధర్నాలు, అరెస్టులు... రాష్ట్రం రణరంగం

ఆర్టీసీ ఉద్యమం రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. కార్మికుల నిరసనలు.. పోలీసుల అడ్డంకుల మధ్య నిర్వహించిన బస్​రోకో,  ఐకాస నిరాహార దీక్షలు రణరంగాన్ని తలపించాయి. సమ్మె ఇవాళ్టికి 44రోజులకు చేరినప్పటికి ప్రభుత్వంలో చలనం లేదు.. హైకోర్టు తీర్పు వరకు వేచి చూస్తారా..? లేక.. ప్రత్యమ్నాయం ఆలోచిస్తారా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది.?

author img

By

Published : Nov 17, 2019, 5:05 AM IST

Updated : Nov 17, 2019, 7:00 AM IST

దీక్షలు, ధర్నాలు, అరెస్టులు - రాష్ట్రం రణరంగం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల దీక్షలు, ధర్నాలు, అరెస్టులతో జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మె 44వ రోజుకు చేరింది. అన్ని డిపోల ఎదుట కార్మికులు బస్​రోకో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే బస్టాండ్​ల ఎదుట ఆందోళనకు దిగారు. ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడివారిని అక్కడే అరెస్టు చేశారు.

"ఆర్టీసీ విలీనం ప్రతిపాదనపై.. ఐకాస తగ్గినా.. ప్రభుత్వం స్పందించలేదు. తెగేదాకా లాగేందుకే అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని హైకోర్టు విఙ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సమస్య జఠిలం అవుతోంది.. పరిష్కారం కనిపించడం లేదు"

మీర్‌పేట్‌ స్వగృహంలో అశ్వత్థామరెడ్డి దీక్ష

ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతివ్వకపోవడం వల్ల మీర్‌పేట్‌ పీఎస్​ పరిధిలోని ఊర్మిలానగర్‌లోని ఆయన నివాసంలోనే దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు విరామం లేదని ప్రకటించారు.

ఎల్బీనగర్ పీఎస్​లో రాజిరెడ్డి దీక్ష
ఎల్బీనగర్ రెడ్డికాలనీలో ఐకాస కోకన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయమే ఆయన ఇంటికి పోలీసులు చేరుకున్నారు. నిరసనలకు అనుమతి లేదంటూ కార్మికులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగటం వల్ల బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రాజిరెడ్డిని అరెస్ట్ చేసి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

చర్చలకు పిలుస్తారా..లేదా..?
ఆర్టీసీ కార్మికులపై దమనకాండను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. ప్రశాంతంగా నిరవధిక దీక్ష చేస్తామని ప్రకటిస్తే ఆర్టీసీ జేఏసీ నాయకులను గృహ నిర్బంధం చేసి.. వారి ఇళ్లపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చర్చలకు పిలవాల్సిందిపోయి రెచ్చగొట్టే పద్ధతిని అవలంబిస్తోందని మండిపడ్డారు

సడక్ బంద్ విజయవంతం చేయండి: కోదండరాం
ఆర్టీసీ ఐకాస నేతల నిరవధిక దీక్షకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఈనెల 19న జరిగే సడక్ బంద్ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వాన్ని విచారించాలి:సీపీఐ
కార్మికుల ఫ్రావిడెంట్‌ ఫండ్‌(పీఎఫ్‌)ను వినియోగించుకున్న యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారించాలని రాజ్యసభ సభ్యుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి బినోయ్‌ విశ్వం డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమ్మెను నిర్బంధించేందుకు కేసీఆర్‌ అప్రజాస్వామిక, నిరంకుశ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.

సురేందర్‌ కుటుంబానికి తెదేపా సాయం

గత నెల 13వతేదీన ఆత్మహత్య చేసుకున్న రాణిగంజ్‌ డిపో కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ కుటుంబానికి తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. సురేందర్‌గౌడ్‌ భార్య జ్యోతికి శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ నేతలు రమణ, గోషామహల్‌ తెదేపా ఇన్‌ఛార్జి పేటానందర్‌ కిశోర్‌, నగర నేతల సమక్షంలో చెక్‌ను చంద్రబాబు అందజేశారు.

సురేందర్‌ కుటుంబానికి తెదేపా సాయం
సురేందర్‌ కుటుంబానికి తెదేపా సాయం

జిల్లాలు ధర్నాలు

  1. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట డిపో ఎదుట ధర్నా చేసిన ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ ఐకాస, వామ పక్ష ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు రెండు బృందాలుగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. మొదట డిపో ఎదుట ధర్నా చేసి బస్సులను అడ్డుకున్న ఆర్టీసీ ఐకాస బాధ్యులు రవి, రాజయ్య, బి.రవి, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
  2. హైదరాబాద్‌ పాతబస్తీ ఫారూఖ్‌నగర్‌ డిపో ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన 15 మందికార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. ఫలక్‌నుమా బస్సుడిపో ఎదుట ఆందోళన చేస్తున్న 40 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.
  3. సిద్దిపేటలోనూ నిరసనల పర్వం కొనసాగుతోంది. డిపో ఎదుట బైఠాయించిన కార్మికులు.. బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.
  4. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వేకువజామునే డిపోల వద్దకు చేరుకున్న కార్మికులు కార్మికులు, అఖిల పక్ష నాయకులు బైఠాయించారు. డిపోల నుంచి బస్సులు రాకుండా అడ్డుపడ్డారు.
  5. మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ డిపోకు చెందిన 18 మంది మహిళా కండక్టర్లు శనివారం స్వీయ గృహనిర్బంధం చేసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అరెస్టు చేసిన 70 మంది కార్మికులను విడుదల చేయాలంటూ జిల్లా కేంద్రంలోని ఓ మహిళా కండక్టరు ఇంట్లో 18 మంది దీక్షకు దిగారు. ఓ దశలో తాము ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. రాత్రి 8.00 గంటల వరకు ఉదిక్త్ర పరిస్థితి కొనసాగింది. మహబూబ్‌నగర్‌ డీఎస్పీ శ్రీధర్‌ ఐకాస నేతలు, పార్టీల నేతలతో చర్చలు జరిపారు. మహిళా కండక్టర్లు బయటకు వస్తే అరెస్టయిన 70 మందిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు దీక్ష విరమించారు. అనంతరం కార్మికులను విడుదల చేయాలని పోలీసులు సూచించారు.
  6. ఇదీ చదవండి: ఆర్టీసీ గురించి ఎండీ సునీల్‌శర్మకు ఏం తెలుసు: అశ్వత్థామరెడ్డి

Intro:Body:Conclusion:
Last Updated : Nov 17, 2019, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.