ETV Bharat / city

అపోహలు వదిలి.. ముందుకురండి: బాలయ్య - తలసేమియా వ్యాధి వార్తలు

దేశంలో ఏటా 12 వేల మందికి పైగా చిన్నారులు తలసేమియాతో జన్మిస్తున్నట్లు నటుడు బాలకృష్ణ పేర్కొన్నారు. రక్తమార్పిడి ఒక్కటే అలాంటి వారిని కాపాడే మార్గమన్న బాలయ్య.. ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని కోరారు.

balakrishna speaks on thalassemia patients
అపోహలు వదిలి.. ముందుకురండి: బాలయ్య
author img

By

Published : Oct 1, 2020, 4:50 PM IST

చిన్నారుల ప్రాణాలను బలికొంటున్న భయంకరమైన వ్యాధుల్లో తలసేమియా ఒకటని ప్రముఖ నటుడు, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు.

అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరంలో పాల్గొనాలని కోరారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులను కాపాడేందుకు రక్తమార్పిడి ఒక్కటే మార్గమన్నారు.

రక్తదానం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావన్న బాలయ్య.. అపోహలు వదిలి ముందుకురావాలన్నారు. ఏటా దేశంలో సుమారు 12 వేల మందికి పైగా చిన్నారులు తలసేమియాతో జన్మిస్తున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. వారిని కాపాడేందుకు రక్తదానం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అభిప్రాయపడ్డారు.

అపోహలు వదిలి.. ముందుకురండి: బాలయ్య

ఇవీచూడండి: కరోనా వేళ రక్తం దొరక్క తలసేమియా బాధితుల ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.