ఏపీలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ముంబయి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ విమానం.. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే.. ఏటీసీ సిగ్నల్ ఇవ్వకపోవడం, ఇంధన నిల్వలు తక్కువగా ఉండటంతో విజయవాడలో అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతిచ్చారు. 227 మంది ప్రయాణికులతో ఉన్న విమానం.. ఇంధనం నింపుకొని అరగంట తరువాత హైదరాబాద్ బయలుదేరింది.
ఇదీ చదవండి: TS Schools New Timings: నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలకు పాత వేళలే..