ETV Bharat / city

Youth Icons: వీరి సేవకు ‘డయానా’ పురస్కారం - ఈటీవీ భారత్ ప్రత్యేక కథనాలు

చిన్నారుల రక్షణే ధ్యేయంగా వారి సంక్షేమానికి పాటుపడుతోన్నవారు ఒకరైతే.. పాత పాదరక్షలకు కొత్త రూపునిచ్చి అవసరార్థులకు అందిస్తున్నారు మరొకరు.. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కంకణం కట్టుకున్నారు ఇంకొకరు.. ఇలా చిన్న వయసులోనే పెద్ద మనసుతో తమ సేవా దృక్పథాన్ని చాటుతూ, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు అమ్మాయిలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి యూత్‌ ఐకాన్స్‌ సేవలను గుర్తించిన బ్రిటన్‌ ప్రభుత్వం వారిని ఏటా ‘డయానా అవార్డు’తో సత్కరిస్తుంటుంది. అలా ఈ ఏడాదికి గాను మన దేశం నుంచి కొందరు అమ్మాయిలు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్నారు. మరి, వారెవరు? సమాజానికి వాళ్లు చేసిన మంచి ఏంటో తెలుసుకుందాం రండి..

vasundhara special story on diana award
డయానా అవార్డుపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం
author img

By

Published : Jul 1, 2021, 10:09 AM IST

కూడు, గూడు, గుడ్డ.. మనిషికి కావాల్సిన కనీస అవసరాలివి! కానీ ఇవే లేకుండా ఎంతోమంది పేదవారు బతుకు బండిని లాగుతుంటారు. కొంతమందికైతే కనీసం వేసుకుందామంటే చెప్పులు కూడా ఉండవు.. అలాంటి వారిని చూసి బెంగళూరుకు చెందిన 14 ఏళ్ల సియా గోడికా మనసు చలించిపోయింది. ఎలాగైనా వారికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఇదే ఆమెను ‘సోల్‌ వారియర్స్‌’ అనే కార్యక్రమం ప్రారంభించేందుకు ఊతమిచ్చింది. ‘Donate a sole, save a soul’ అనే ట్యాగ్‌లైన్‌తో 2019లో మొదలైన ఈ పాదరక్షల ఉద్యమం నేటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. పాత/పాడైపోయిన పాదరక్షల్ని సేకరించి.. వాటికి కొత్త సొబగులద్ది అవసరంలో ఉన్న వారికి అందించడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం అని చెబుతోందీ టీన్‌ వారియర్.

పాదరక్షలకు మెరుగులద్ది..!

‘మా ఇంటికి దగ్గర్లో ఎంతోమంది పేదవారు కనీసం పాదాలకు చెప్పులు కూడా వేసుకోకుండా కూలి పనులు చేయడం చూశాను. చాలా బాధనిపించింది. వెంటనే దీనిపై రీసెర్చి మొదలుపెట్టాను. ఈ క్రమంలోనే చెప్పుల్లేకుండా కొన్ని కఠినమైన పనులు చేయడం వల్ల పాదాలకు సంబంధించిన పలు సమస్యలొస్తాయని తెలుసుకున్నా. అందుకే అలాంటి వారికి అండగా ఉండడం కోసం సోల్‌ వారియర్స్‌ని ప్రారంభించా. ఇలా ఇప్పటివరకు సుమారు 15 వేలకు పైగా పాదరక్షల్ని సేకరించి, వాటిని రిపేర్‌ చేసి అవసరంలో ఉన్న వారికి అందించా..’ అంటూ తన సేవ గురించి చెబుతోంది సియా. కోరమంగళ ప్రాంతానికి చెందిన సియా ప్రస్తుతం అక్కడి నీవ్‌ అకాడమీలో పదో తరగతి చదువుతోంది.

పిల్లల శ్రేయస్సు కోసం..!

తమను తాము కాపాడుకోవడానికి ఆడవారికే కాదు.. చిన్నారులకూ ఆత్మ రక్షణ విద్యలు అవసరం అంటోంది 17 ఏళ్ల ఆరుషీ పంత్‌. కోల్‌కతాకు చెందిన ఈ అమ్మాయి.. ప్రస్తుతం అక్కడి ‘పాత్‌వేస్‌ వరల్డ్‌ స్కూల్’లో చదువుకుంటోంది. పదేళ్ల వయసు నుంచే చిన్నారుల సంరక్షణ గురించి ఆలోచించిన ఆరుషి.. ‘చిల్డ్రన్స్‌ ఆర్మర్‌’ పేరుతో ఓ సంస్థను సైతం స్థాపించింది. ఈ వేదికగా అక్కడి పాఠశాలలన్నీ తిరుగుతూ వారికి ఆత్మరక్షణ విద్యలు నేర్పుతోందీ టీన్‌ గర్ల్.

‘నాకు పదేళ్లున్నప్పుడే పశ్చిమ బంగలోని గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల సంరక్షణ ప్రాజెక్ట్‌లో భాగంగా ASHAతో కలిసి పని చేశా. ఈ క్రమంలో పిల్లల భద్రత కోసం కొన్ని టూల్స్‌ సైతం రూపొందించాను. ఇదే విషయమై పలు అవగాహన కార్యక్రమాలు సైతం చేపట్టాను. ఈ ఆలోచనల్లోంచి పుట్టిందే ‘చిల్డ్రన్స్‌ ఆర్మర్‌’ అనే సంస్థ. పిల్లల నేతృత్వంలోనే ఇది ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఇందులో సుమారు 50 మందికి పైగా పిల్లలు సభ్యులుగా ఉన్నారు. వారితో కలిసి మారుమూల గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లడం, అక్కడి చిన్నారులకు విద్య ప్రాముఖ్యం, ఆత్మరక్షణ విద్యలు, ఆటలు, పాటలతో వారిని ఉత్సాహపరచడం.. వంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాదు.. వారిలో మానసిక వికాసం పెంపొందించేందుకు వాళ్ల తల్లిదండ్రులతో సైతం సమావేశమవుతాం. కొవిడ్‌లోనూ అవసరార్థుల్ని ఆదుకోవడానికి నిధులు సేకరించాం..’ అంటోంది ఆరుషి.

విద్యతో పాటు విజ్ఞానాన్నీ అందిస్తూ..!

పిల్లలు తరగతి గదిలో నేర్చుకున్న దాని కంటే విద్యా విహార యాత్రలతోనే ఎక్కువ విషయ పరిజ్ఞానం సంపాదించుకోగలరంటోంది దిల్లీకి చెందిన మహీరా జైన్. అటు వినోదాన్ని, ఇటు విజ్ఞానాన్ని అందించే ఇలాంటి యాత్రలను (ఎక్స్‌కర్షన్స్‌) తన ‘FunWagon’ స్టార్టప్‌ ద్వారా చేపడుతోంది మహిర. ఇందుకోసం వివిధ స్వచ్ఛంద సంస్థలతో, స్కూళ్లతో కలిసి పని చేస్తోంది. తన టూర్లలో భాగంగా నేషనల్‌ మ్యూజియం, లోథి ఆర్ట్‌ డిస్ట్రిక్ట్‌, ఇండియా గేట్‌, గాంధీ స్మృతి.. తదితర ప్రదేశాలకు పిల్లల్ని విహారయాత్రల కోసం పంపిస్తూ వారికి ఇటు వినోదాన్ని, అటు విజ్ఞానాన్ని ఏకకాలంలో అందిస్తోందీ అమ్మాయి. అంతేకాదు.. వెళ్లిన చోట అక్కడి చారిత్రక కట్టడాలపై క్విజ్‌ పోటీలు, ఉల్లాసభరితమైన ఆటలు.. వంటివి నిర్వహిస్తూ పిల్లల మధ్య కమ్యూనికేషన్‌ను సైతం పెంచుతోంది మహిర.

‘మా సంస్థ కేవలం ఇండియాలోనే కాదు.. అంతర్జాతీయంగా ఉన్న విద్యార్థులకు సైతం వర్చువల్‌గా ఎక్స్‌కర్షన్స్‌ నిర్వహిస్తోంది. ఇక లాక్‌డౌన్‌లోనూ ఇక్కడి పిల్లలు విహారాన్ని, విజ్ఞానాన్ని మిస్‌ కాకుండా వర్చువల్‌గా విహార యాత్రల్ని చేపడుతున్నాం. ఇక దేశ సంస్కృతి సంప్రదాయాల గురించి పిల్లలకు పూర్తి అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రత్యేకమైన కరిక్యులం రూపొందించి విద్యార్థులకు అందించాం..’ అంటూ తన ఇనీషియేటివ్‌ గురించి చెప్పుకొచ్చిందీ దిల్లీ టీన్.

కరోనా వేళ.. యువతకు అండగా!

దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే అది యువత చేతిలోనే ఉందంటోంది దిల్లీకి చెందిన యువ సామాజికవేత్త సనా మిట్టర్‌. ఇంగ్లండ్‌లోని వార్విక్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోన్న ఈ అమ్మాయి.. సమాజంలో మార్పు తెచ్చే యువతలో చైతన్యం నింపే బృహత్తర బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. ఈ క్రమంలోనే UN sustainable development goals (SDG) అనే కార్యక్రమంలో సైతం భాగమైందామె. లాక్‌డౌన్‌ సమయంలోనూ ఓ డిజిటల్‌ క్యాంపెయిన్‌ను ఏర్పాటుచేసి.. 150 మంది వలంటీర్లతో కలిసి ఐదు లక్షల దాకా నిధులు సమీకరించింది. వీటితో మొబైల్‌ ఫోన్లు కొనుగోలు చేసి.. వాటిని పేద విద్యార్థులకు పంపిణీ చేసింది. అలా వాళ్లు ఆన్‌లైన్‌ క్లాసులు మిస్‌ కాకుండా కీలక పాత్ర పోషించిందామె. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘గ్లోబల్‌ వలంటీర్స్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ (GVAN)’ పేరుతో సొంత సంస్థను స్థాపించి.. ఆ వేదికగా కరోనా కష్టాల్లో చిక్కుకున్న యువతను ఆదుకుంది.

‘కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఎంతోమంది యువత సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరికొందరు తమ వద్ద తగిన సదుపాయాలు, వనరులు లేకపోవడంతో అక్కడే ఆగిపోయారు. కానీ సేవ చేయాలన్న సంకల్పం ఉంటే చాలు.. వనరులు వాటంతటవే సమకూరుతాయని చెప్పడానికే నేనీ సంస్థకు శ్రీకారం చుట్టాను. ఈ కరోనా కష్టకాలంలో నా వంతుగా సహకరించాను..’ అంటోంది సనా.

పర్యావరణంపై పరిశోధనకు గాను..

మానవ తప్పిదాల వల్ల ఎదురయ్యే వాతావరణ కాలుష్యం తిరిగి మనకే ముప్పు తెచ్చిపెడుతుందని చెబుతోంది పదిహేనేళ్ల దిల్లీ టీనేజర్‌ సెహెర్ తనేజా. ఇదే అంశంపై పరిశోధనలు చేసి సేకరించిన సమాచారం అమెరికాకు చెందిన ‘ఎమర్జింగ్‌ ఇన్వెస్టిగేటర్స్‌’ అనే జర్నల్‌లో ప్రచురితమైందంటూ సంబరపడిపోతోందీ అమ్మాయి. ‘అది 2017. దీపావళి సమయంలో సెలవుల్ని మరింతగా పెంచారు. ఇందుకు కారణం వాతావరణ కాలుష్యం.. దీంతో మా పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అప్పుడనిపించింది.. ఇది అంత తేలిగ్గా వదిలే విషయం కాదని! వాతావరణం కలుషితమయ్యాక దాన్ని తగ్గించడం కంటే కలుషితం కాకుండా సమస్యను ఆదిలోనే అరికట్టాలనిపించింది. అందుకే దీనిపై పరిశోధనలు చేశా. ఈ క్రమంలో అమ్మానాన్నలు కూడా ఎంతగానో ప్రోత్సహించారు.. శాస్త్రీయపరంగా ఆమోదాలు, వ్యతిరేకతల మధ్య ఈ పరిశోధనల్ని కొనసాగించా..’ అంటోంది తనేజా. ప్రస్తుతం దిల్లీలోని స్ప్రింగ్‌డేల్స్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతోందీ యువ పర్యావరణ వేత్త.

వీరితో పాటు సంజోలీ బెనర్జీ, రియా మానస్‌ శర్మ, పరిధి పూరీ, దేవాన్షీ రంజన్‌.. తదితరులు కూడా ఈ ఏడాది డయానా అవార్డును అందుకున్నారు. సమాజానికి తమ వంతుగా సేవలందించే 9-25 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఏటా ఈ అవార్డుల్ని అందిస్తుంటుంది బ్రిటన్‌ ప్రభుత్వం. దివంగత రాణి ప్రిన్సెస్‌ డయానా జ్ఞాపకార్థం అందించే ఈ పురస్కారాలు ఈసారి వర్చువల్‌గా నిర్వహించారు.

ఇదీ చదవండి: అంచనాకు మించి దిగుబడులు.. రికార్డు స్థాయిలో కొనుగోళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.