ETV Bharat / city

'రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు'

author img

By

Published : Aug 15, 2020, 2:04 PM IST

రాష్ట్రవ్యాప్తంగా 74వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాల్లో మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా కొద్దిమంది అతిథుల సమక్షంలోనే వేడుకలను సాదాసీదాగా నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య  వేడుకలు

రాజన్న సిరిసిల్లలో పురపాలక మంత్రి కె.తారకరామారావు స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్​ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు . సిద్దిపేట సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జాతీయ జెండాను ఎగురవేశారు. కోవిడ్ కారణంగా వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి వివరించారు.

వరంగల్‌లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. వేడుకల అనంతరం పలు పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మువ్వన్నెల జెండాను సినిమాపోటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎగురవేశారు. కరీంనగర్‌లో సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ జాతీయపతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్లు వివరించారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాఠోడ్ జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. వచ్చే ఆగస్టు 15 నాటికి కరోనా అంతరించిపోయి...ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

నల్గొండ కలెక్టరేట్‌లో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జాతీయపతాకాన్ని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ ఆవిష్కరించారు . యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. జనగామ పాలనాధికారి కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ చీప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. భూపాలపల్లి పాలనాధికార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీంతో కలిసి మండలి విప్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు . మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

ఇవీ చూడండి: ఔరా: జాతీయ జెండా ఎగరవేసిన చిలుక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.