ETV Bharat / city

Gst on garments: పెరిగిన జీఎస్టీ.. కొత్త ఏడాదిలో వస్త్రాల ధరలకు రెక్కలు.! - వస్త్రాల ధరలపై పెరిగిన జీఎస్టీ

Gst on garments: కొత్త ఏడాది నుంచి.. వస్త్రాల కొనుగోళ్లు పెను భారం కానున్నాయి. దుస్తుల కొనుగోళ్లపై ప్రస్తుతం ఉన్న పన్నుకు అదనంగా మరో 7 శాతం జీఎస్టీని జోడించనున్నారు. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గి.. విక్రయాలు పడిపోయే ప్రమాదముందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Gst increased on garments
దుస్తులపై పెరిగిన జీఎస్టీ
author img

By

Published : Dec 15, 2021, 11:45 AM IST

Gst increased on garments: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అన్ని రకాల వస్త్రాలు, రెడీమెడ్ దుస్తుల ధరలు పెరగనున్నాయి. వస్త్ర పరిశ్రమపై ఉన్న 5 శాతం విలువ ఆధారిత పన్నుకు అదనంగా మరో 7 శాతం జోడించి.. 12 శాతానికి పెంచనుండటమే దీనికి కారణం. ప్రస్తుతం రెడీమెడ్‌ గార్మెంట్స్‌లో ఒక పీస్ ఎమ్మార్పీ వెయ్యి రూపాయల లోపు ఉంటే.. 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఎమ్మార్పీ వెయ్యి రూపాయలు దాటిన వాటిపై 12 శాతం విధిస్తున్నారు. జనవరి 1 నుంచి ఎమ్మార్పీతో నిమిత్తం లేకుండా అన్ని రకాల రెడీమెడ్ దుస్తులపై 12 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నారు. గతంలో జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయం కొత్త ఏడాది నుంచి అమలు కానుంది. దీని వల్ల ధరలు పెరిగి.. ఏపీలో వినియోగదారులపై అదనంగా ఏడాదికి రూ. 2,100 కోట్ల భారం పడనుంది.

కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న దశలో...

శ్రీకాకుళం, విజయనగరం, తుని, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, వెంకటగిరి, ప్రొద్దుటూరు, ధర్మవరం, రాయదుర్గం వస్త్ర రంగానికి కేంద్రాలు. టెక్స్‌టైల్‌, రెడీమెడ్‌ గార్మెంట్స్‌ రంగంలో 50 వేల పైచిలుకు దుకాణాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.30 వేల కోట్ల వరకు లావాదేవీలు సాగుతున్నాయి. ప్రస్తుతం 5% జీఎస్టీ ప్రకారం... రూ.1,500 కోట్లు వినియోగదారులపై భారం పడుతోంది. అదనంగా పెరిగే 7%తో భారం రూ.2,100 కోట్లను కలుపుకుంటే.. ఇకపై మొత్తం జీఎస్టీ రూ.3,600 కోట్లు కానుంది.

రూ.2 లక్షల వస్త్రాలు కొంటే...

సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సమయంలో అన్ని వర్గాల వారు వస్త్రాల కొనుగోలుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. వచ్చే నెలలో సంక్రాంతి రాబోతోంది. ఉదాహరణకు శుభకార్యాల కోసం ఎవరైనా రూ.2 లక్షలు వెచ్చించి వస్త్రాలు కొనుగోలు చేశారనుకుంటే... ప్రస్తుతం రూ.10,000 జీఎస్టీ చెల్లించాలి. కొత్త ఏడాదిలో అదనంగా 7% జీఎస్టీ పెంపుతో రూ.24,000 కట్టాల్సి వస్తుంది.

ఇప్పటికే పెరిగిన ధరలతో....

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, దారం, ఇతర ముడిసరకుల ధరల వల్ల వ్యాపార నిర్వహణ ఖర్చులు రెట్టింపయ్యాయి. సూరత్‌ నుంచి ఒక వస్త్రాల పార్సిల్‌ (30/40 కిలోలు) విజయవాడకు చేరుకోవాలంటే ఇటీవలి దాకా రూ.250 ఖర్చయ్యేది. ఇప్పుడది రూ.600కు చేరింది. ఈ పరిస్థితుల్లో పన్ను పెరిగి.. ప్రజల్లో కొనుగోలుశక్తి తగ్గి, అమ్మకాలు సాగని పరిస్థితులు తలెత్తుతాయని, చిరు వ్యాపారులు ఈ రంగానికి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: political leaders support for realtors: స్థిరాస్తి వ్యాపారులకు ప్రజాప్రతినిధుల అండ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.