ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో రెండు ఆంబోతులు హోరాహోరీగా తలపడ్డాయి. సుమారు 20 నిమిషాలపైగా ఈ సమరం సాగడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
చుట్టు పక్కల ప్రజలు వాటిని చెదరగొట్టేందుకు నీళ్లు కూడా చల్లారు. అయినా అవి పోరాటం ఆపలేదు. ఈ ఘర్షణలో రెండు ఆంబోతులకు కొమ్ముల నుంచి రక్తం చిందింది. అయినా రెండింటిలో ఏదీ వెనక్కి తగ్గలేదు. చివరకు స్థానికులు కర్ర చేతపట్టుకుని వాటిని విడదీశారు. సినిమా పోరాట సన్నివేశాలను తలదన్నే ఈ దృశ్యాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
- ఇదీ చదవండీ : హరియాణాలో ఘోరం-- పట్టపగలే యువతిపై కాల్పులు