రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని.. విద్యార్థులు ఆ దిశగా అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మోహన్ రాయుడు, అవంతి కాలేజ్ జనరల్ సెక్రటరీ డా.ప్రియాంక తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గుంతపల్లిలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో "టెక్ రిసొనన్స్ 2కే-22" పేరుతో టెక్నికల్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సంద్భంగా విద్యార్థులు తాము తయారు చేసిన వివిధ రోబోటిక్ మిషన్స్‌ను ప్రదర్శించారు. విద్యార్థుల నూతన ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి.
విదార్థుల ఆవిష్కరణలను కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు.. నిశితంగా పరిశీలించారు. వాటి ప్రత్యేకత.. పని తీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆలోచనలను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా టెక్నాలజీ అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందని మోహన్‌రాయుడు అభిప్రాయపడ్డారు. రోజు రోజుకు టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అదే క్రమంలో విద్యార్థులు వాటిపై అవగాహన పెంచుకుంటూ నూతన ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్స్.. పెరుగుతున్న టెక్నాలజీకి అద్దం పడుతున్నాయన్నారు.
ఇదీ చూడండి: