ETV Bharat / city

Sravana masam: శుభకార్యాల మాసం.. 'శ్రావణం'

author img

By

Published : Aug 9, 2021, 8:38 AM IST

సిరుల తల్లిని భక్తిశ్రద్ధలతో కొలిచే శ్రావణాన్ని శుభకార్యాల మాసమని అంటారు. సర్వదేవతలకూ అత్యంత ప్రీతికరమైన నెలగా పరిగణించే శ్రావణంలో చేసే ప్రతి పూజకూ ఎంతో ఫలితం ఉంటుంది. వేంకటేశ్వరస్వామికి పవిత్రోత్సవం పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించే ఈ శ్రావణ మాసం అంటే మహావిష్ణువుకు కూడా చాలా ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి.

Sravana masam
శ్రావణ మాసం

శ్రావణమాసం... కలియుగ దైవం వేంకటేశ్వరుడు జన్మించిన శ్రవణా నక్షత్రం పేరుతో వచ్చే ఈ నెల సంవత్సరంలో అయిదోది. మహావిష్ణువు- మహాలక్ష్మికి ఇష్టమైన ఈ మాసం పెళ్లిళ్లు, నోములు, వ్రతాలు, పూజలు ఇతర శుభకార్యాలు నిర్వహించేందుకు అనువైనదని చెబుతారు. ఈ నెలలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలే కాదు, అమావాస్య, అష్టమి రోజులను కూడా పర్వదినాలుగా పరిగణించడం విశేషం. పురాణాల ప్రకారం... పాల సముద్ర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు ఈ శ్రావణమాసంలోనే స్వీకరించి నీలకంఠుడిగా పేరు పొందాడని ప్రతీతి. అందుకే ఈ నెలలో వచ్చే సోమవారాల్లో శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా మంచి భర్త లభించాలని అవివాహితులు, తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. ఈ నెలలో వచ్చే పంచమిని నాగపంచమిగా పిలుస్తారు. సంతానం లేనివారు ఈ రోజున ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్లి పాలు పోసి నాగ దేవతను పూజిస్తే సంతానం కలుగుతుందని, సర్వదోషాలు పోతాయని భక్తుల నమ్మకం. పుత్రద ఏకాదశిగా పిలిచే శ్రావణ శుక్ల ఏకాదశి రోజున కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సంతానం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నెలలో వచ్చే శ్రావణ శుక్ల విదియ నాడు రాఘవేంద్రస్వామి జీవసమాధి అయ్యాడు కాబట్టి... ఆ రోజున మంత్రాలయంలో విశేష పూజలు జరుపుతారు.

Sravana masam
శ్రావణ మాస పూజలు

వరలక్ష్మీ రావమ్మా

ఈ నెలలో వచ్చే శుక్రవారాలను శ్రావణ శుక్రవారాలుగా పిలుస్తారు. ఈ రోజుల్లో మహిళలు తమ సౌభాగ్యం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం వరలక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. చారుమతీ దేవి అనే భక్తురాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్యాలూ, సకల శుభాలూ పొందిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ కథను అనుసరించే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం పేరుతో నవ వధువులు, వివాహితులు వరలక్ష్మీ దేవిని పూజించి ఇరుగుపొరుగు స్త్రీలను ఆహ్వానించి పేరంటం నిర్వహిస్తారు.

Sravana masam
శ్రావణ మాసం

రాఖీ పౌర్ణమికి ఎంతో విశిష్ఠత

శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిగా పిలుస్తారు. ఈ రోజున అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రక్షాబంధనాన్ని కట్టడం తెలిసిందే. ఈ రోజున యజ్ఞోపవీతం వేసుకునేవారు పాతదాన్ని తీసేసి కొత్తది ధరించడం ఓ ఆచారంగా పాటిస్తారు. ఈ రోజునే మహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజును హయగ్రీవ జయంతిగా జరిపి సెనగలు, ఉలవలతో గుగ్గిళ్లను చేసి నైవేద్యం సమర్పిస్తారు.

Sravana masam
శ్రావణ మాస పూజలు

శ్రీనివాసుడికి పవిత్రోత్సవం

కలియుగ దైవంగా పూజలు అందుకుంటున్న వేంకటేశ్వర స్వామికి ఏడాదిమొత్తం విశేష పూజలు జరగడం తెలిసిందే. వాటిని నిర్వహిస్తున్నప్పుడు జరిగే పొరపాట్లను క్షమించమని కోరుతూ శ్రావణంలో స్వామికి పవిత్రోత్సవం పేరుతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దీన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం మల్లదేవ అనే రాజు ప్రారంభించాడని.. అప్పటినుంచి వాటిని అలాగే కొనసాగిస్తున్నారని అంటారు. ఈ నెలలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజుల్లో ఆ ఉత్సవాలను చేస్తారు. మొదటి రోజున అంకురార్పణ చేస్తే ద్వాదశినాడు స్వామికి ప్రత్యేక పూజలు జరిపి పవిత్రాలు పేరుతో నలుపు, నీలం, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ పట్టుదారాలను సమర్పిస్తారు. మూడో రోజున పూర్ణాహుతి నిర్వహించి స్వామిని ఊరేగించడంతో ఈ పవిత్రోత్సవం ముగుస్తుంది. ఇవి కాకుండా ఈ నెలలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్యగా పిలుస్తారు. అదేవిధంగా వరాహ జయంతి, కృష్ణాష్టమిని కూడా శ్రావణమాసంలో జరుపుకుంటారు.

ఇదీ చదవండి: ETELA: హుజూరాబాద్​లో పోటీ చేసి గెలవండి.. కేసీఆర్‌, హరీశ్‌కు సవాల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.