రాజ్యాంగ విచ్ఛిన్నం వ్యవహారంపై కేసుల్లో జస్టిస్ రాకేశ్‌కుమార్‌ను విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ... ఏపీ ప్రభుత్వం తరపున హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగ విచ్ఛిన్నంపై తేల్చాలని పిటిషన్ దాఖలు కాకపోయినా.. జస్టిస్ రాకేశ్‌కుమార్ తనకు తానుగా విచారణ జరపడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. విచారణ పూర్తి కాకుండానే ముందుగా ఓ నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనపై పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో రాజ్యాంగ విచ్ఛిన్నం వ్యవహారంపై జస్టిస్ రాకేశ్‌కుమార్ సభ్యులుగా ఉన్న ధర్మాసనంలో.. నిష్పాక్షిక విచారణ సాధ్యపడదని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అభిప్రాయపడ్డారు. అడ్వొకేట్ జనరల్ చెప్పే వాదనలను వినకుండానే... ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేశారని గుర్తుచేశారు. ప్రజాహిత వ్యాజ్యంలో పిటిషనర్ దాఖలు చేసిన అదనపు వివరాలపై వాదనలు చెప్పే అవకాశాన్ని పోలీసుల తరపు ప్రత్యేక సీనియర్ కౌన్సిల్‌కు ఇవ్వలేదని వివరించారు.
ఇదీ చదవండీ : లైవ్ వీడియో: వైన్స్‌లో దొంగతనం