ETV Bharat / city

నివర్ ఎఫెక్ట్​: 'అర్ధరాత్రి నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు' - ఏపీలో నివర్ తుపాను ప్రభావం

నివర్ తుపాను వేగంగా.. తమిళనాడు తీరం వైపునకు దూసుకొస్తోందని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. తుపాను తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల మేర ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు, చిత్తూరులోనూ తుపాను కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.

అర్ధరాత్రి నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు
అర్ధరాత్రి నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు
author img

By

Published : Nov 25, 2020, 7:56 PM IST

నివర్ తుపాను వేగంగా తమిళనాడు తీరం వైపునకు దూసుకొస్తోందని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇది గంటకు 11 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. తమిళనాడులోని కడలూరుకు దగ్గరగా వస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతమిది కడలూరుకు ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉనట్లు వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. కొద్ది గంటల్లోనే ఇది పెనుతుపానుగా మారుతుందన్నారు.

ఈ అర్ధరాత్రి తర్వాత పెనుతుపానుగానే తమిళనాడులోని కరైకాల్-మామల్లపురం వద్ద తీరాన్ని దాటుతుందన్నారు. తుపాను తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల మేర ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది.

ఏపీ, తెలంగాణల్లోనూ...

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు, చిత్తూరులోనూ తుపాను కారణంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. నివర్ తుపాను ప్రభావంతో ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, అనంతపురం, కడప జిల్లాలతో పాటు తెలంగాణాలోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుపాను తీరాన్ని దాటిన వెంటనే బలహీనపడి వాయుగుండంగా, ఆ తదుపరి అల్పపీడనంగా మారుతుందన్నారు. దీంతో రాగల రెండు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

ఇదీచదవండి: మరి కొన్ని గంటల్లో.. పెను తుపానుగా బలపడనున్న నివర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.