ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
ఈరోజు మెదక్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర సంచాలకులు వివరించారు. ఉత్తర కోస్తా ఆంధ్రా దాని పరిసర ప్రాంతాల్లో 5.8కిమీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం