ETV Bharat / city

లాక్​డౌన్​ కాలం అక్రమార్కులకు రాజమార్గం - మద్యం లేక మతిస్థిమితం కోల్పోయి

తెలంగాణలో అక్రమ మద్యం విక్రయానికి తెరలేసింది. దొడ్డిదారిన అధిక ధరలకు అమ్మి అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. రాత్రికిరాత్రే దుకాణాల్లోని సీసాలు మాయమవుతున్నాయి. ముందు జాగ్రత్తగా కొంతమంది మందు కునుక్కొని పొదుపుగా వాడుకున్నా... వారం పది రోజులకే బాటిళ్లు ఖాళీ అయ్యాయి. ఇప్పుడేం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో అధిక ధరలక్కూడా కొనేందుకు వెనకాడటం లేదు.

illegal wine sales in telangana at lock down time
లాక్​డౌన్​ కాలం అక్రమార్కులకు రాజమార్గం
author img

By

Published : Apr 13, 2020, 10:34 AM IST

లాక్​డౌన్​తో బార్లు, క్లబ్​లు, పబ్​లు, మద్యం దుకాణాలు అన్నీ మూతపడ్డాయి. లాక్​డౌన్​ విధిస్తారని తెలియగానే మందుబాబులు కొందరు ముందు జాగ్రత్తగా అధనంగా కొని దాచుకున్నారు. సాధారణంగా రోజుకి సగటున రూ. 60 కోట్లు విలువైన మద్యం అమ్ముడయ్యేది. మార్చి 18న రూ.56 కోట్లు, 19న రూ.54.84 కోట్లు, 20న రూ.83 కోట్ల విక్రయాలు జరిగితే... ఒక్క మార్చి 21 నాడే రూ.110 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. .

కిక్కు లేక మతిస్థిమితం కోల్పోతున్నారు

బానిసలుగా మారిన కొందరు మద్యం ప్రియలు... మందు దొరకక దుకాణాల వద్ద మకాం పేసి కాపు కాస్తున్నారు. మరికొందరైతే... దొంగతనం చేసేందుకు యత్నించి విఫలమయ్యారు. మద్యం, కల్లు దొరకక మతిస్థిమితం కోల్పోయారు. ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రికి వందల సంఖ్యలో చికిత్స కోసం వస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ సమయాన్ని అదనుగా చేసుకొని దాచుకున్న మద్యాన్ని ఇష్టానుసారంగా అమ్మి జేబులు నింపుకుంటున్నారు అక్రమార్కులు.

ఆడిందే ఆట..

ఈ నెల 6న అర్ధరాత్రి రామాంతాపూర్​లో రాజా రాజేశ్వరి మద్యం దుకాణం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఉప్పల్ పెట్రోలింగ్ పోలీసులు పట్టుకున్నారు. యజమానే దొంగచాటుగా బయటకు తెచ్చి విక్రయిస్తున్నట్టు ఆబ్కారీ అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ నెల 8న జగద్గిరిగుట్ట వద్ద వేగంగా వెళ్తున్న ఓ కారును ఆపి తనిఖీ చేయగా... 50 బీరు సీసాలు దొరికాయి. ఆదివారం నాడు సికింద్రాబాద్ బొల్లారం చెక్​పోస్టు వద్ద మరో కారును చెక్​ చేయగా... 32 ఖరీదైన మద్యం బాటిళ్లు లభించాయి. దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్టు ఉంది వ్యవహారం.

లాక్​డౌన్​ కొనసాగుతున్నందున వాహనాలు పూర్తిస్థాయిలో తనిఖీ చేయడం లేదు. అనుమానం వచ్చిన వాటిని మాత్రమే చెక్​ చేయడం వల్ల అక్రమార్కులకు రాజమార్గంగా మారింది. లాక్​డౌన్​ కాలంలో వారు ఆడిందే ఆట.. పాటిందే పాటగా మారింది. ఇప్పటికైనా వాహనాలు పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తే మద్యం రవాణాతో పాటు ఇతర అక్రమాలు కూడా బయటకొస్తాయని ఆబ్కారీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి: లాక్‌డౌన్​ అమలు​ చేస్తేనే కరోనా వ్యాప్తి డౌన్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.