autonomous car by IIT Hyderabad : కాలం ముందుకు సాగే కొద్ది సాంకేతిక రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోనే మొదటిసారిగా c... మనుషులను మోసుకెళ్లే డ్రోన్లు తయారుచేసే సాంకేతికతను ఐఐటీ హైదరాబాద్ అందుబాటులోకి తెచ్చింది. సహజ వాతావరణంలో వీటిని పరీక్షించేలా రెండు కిలోమీటర్ల పొడవైన ట్రాక్ నిర్మించారు. సిగ్నల్స్, మలుపులు, స్పీడ్ బ్రేకర్లు, రోడ్ల మీద ఉండే ఇతరత్రా అడ్డంకులు కూడా ఈ ట్రాక్ మీద సృష్టించారు. డ్రైవర్ లేకుండా 2 కిలోమీటర్లు ఓ కారుని నడిపించి పరీక్షించారు. ఇటువంటి సాంకేతిక ప్రయోగం దేశంలోనే మొదటిది కావడం విశేషం. తాజాగా ఇక్కడకు వచ్చిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. డ్రైవర్ లేకుండా నడిచే వాహనంలో ప్రయాణించారు.
ప్రొఫెసర్ రాజలక్ష్మి నేతృత్వంలో దాదాపు నలభై మందికి పైగా యువ పరిశోధకులు ఈ ఆవిష్కరణలో భాగస్వాములవుతున్నారు. వీరు ప్రధానంగా డ్రైవర్ లేకుండా నడిచే కార్లు... మనుషులను మోసుకెళ్లే డ్రోన్లు... ఎవరి అవసరం లేకుండా వాటంతట అవే నడిచే సైకిళ్లను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇవన్నీ పరీక్షల దశలో ఉన్నాయి. వ్యవసాయంలో ఉపయోగించేలా రకరకాల డ్రోన్లను సైతం వీరు సిద్ధం చేస్తున్నారు. కేవలం 20 గ్రాముల బరువున్న డ్రోన్‌నూ ఇక్కడ తయారు చేస్తున్నారు. డ్రైవర్ లేకుండా నడిచే వాహనాలను ఆగస్ట్ నుంచి ఐఐటీ ప్రాంగణంలో నడిపేలా కసరత్తు చేస్తున్నారు.
జాతీయ మిషన్‌లో భాగంగా ఇక్కడ సైబర్ ఫిజికల్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం ఈ పరిశోధనల కోసం 135 కోట్ల రూపాయలు అందించింది. ఈ సాంకేతికత తొందర్లనే అందుబాటులోకి వస్తే రవాణ వ్యవస్థలో గొప్ప మార్పులు చోటుచేసుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.చంద్రశేఖర్, ఐఐటీ బోర్డ్‌ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఆచార్యులు పి.రాజలక్ష్మి, పరిశోధన, అభివృద్ధి విభాగం డీన్ ఆచార్య కిరణ్‌కూచి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి : స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో తెలంగాణ సూపర్‌స్టార్