ETV Bharat / city

రాహుల్‌ గాంధీ పొలిటికల్‌ టూరిస్ట్‌ అయితే.. మరి కేసీఆర్‌?: రేవంత్ రెడ్డి - కేసీఆర్​పై రేవంత్ రెడ్డి ఫైర్

కేసీఆర్‌కు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని విమర్శిస్తారా అని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గాంధీ కుటుంబంతో కేసీఆర్‌ కుటుంబం పోల్చుకునే ప్రయత్నం చేస్తుంటారని విమర్శించారు. అవకాశమున్నా కూడా ప్రధాని పదవిని సోనియా, రాహుల్‌ చేపట్టలేదని చెప్పారు. రాహుల్‌గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఉందా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

revanth reddy
revanth reddy
author img

By

Published : May 8, 2022, 3:17 PM IST

Updated : May 8, 2022, 6:05 PM IST

మంత్రి కేటీఆర్‌ చాలా అహంభావంతో మాట్లాడారని... కాంగ్రెస్‌పై విమర్శలు చేసేటప్పుడు తన తండ్రి చరిత్ర కూడా తెలుకుని మాట్లాడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్‌ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు సింగిల్‌ విండో డైరెక్టర్‌గా ఓడిపోయినా... ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ రాజకీయ భిక్ష పెట్టిందన్నారు. కేసీఆర్‌ మొదట సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. గాంధీ భవన్​లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాహుల్‌ గాంధీ పొలిటికల్‌ టూరిస్ట్‌ అయితే.. మరి కేసీఆర్‌?: రేవంత్ రెడ్డి

గాంధీ కుటుంబంతో కేసీఆర్‌ కుటుంబం పోల్చుకునే ప్రయత్నం చేస్తుంటారని రేవంత్‌ రెడ్డి అన్నారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడింది గాంధీ కుటుంబమని... దేశ అభ్యున్నతి కోసం ఇందిర, రాజీవ్‌ గాంధీ ప్రాణాలర్పించారని కొనియాడారు. అవకాశమున్నా కూడా ప్రధాని పదవిని సోనియా, రాహుల్‌ చేపట్టలేదని చెప్పారు. రాహుల్‌గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఉందా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వనరుల ఆధారంగానే తాము వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకటించినట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల భరోసా కోసమే వరంగల్‌ సభా వేదిక నుంచి కాంగ్రెస్‌ వ్యవసాయ విధానం ప్రకటించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన తొమ్మిది ప్రధానమైన తీర్మాణాలపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉత్సవాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

'రాహుల్‌గాంధీ ఏ హోదాలో రా‌ష్ట్రానికి వచ్చారని అంటున్నారు. ఎక్కడెక్కడో చదువుకున్న కేటీఆర్‌కు.. తెలంగాణలో ఏం అర్హత ఉంది. వరంగల్‌ డిక్లరేషన్‌కు మద్దతుగా రాహుల్‌గాంధీ మాట్లాడారు. శరద్‌పవార్‌, స్టాలిన్‌, దీదీ వద్దకు కేసీఆర్‌ వెళ్లిరావచ్చు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడి హోదాలో వచ్చిన రాహుల్‌ను ప్రశ్నిస్తారా? రాహుల్‌ పొలిటికల్‌ టూరిస్ట్‌ అయితే.. మరి కేసీఆర్‌ను ఏమనాలి? భాజపా, తెరాస, మజ్లిస్‌ ఒకే భావజాలంతో పనిచేస్తున్నాయి. ' - రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

అధికార తెరాసపై కాంగ్రెస్‌ విమర్శలు చేస్తే భాజపా, ఎంఐఎంలు కూడా స్పందించాయని... తెరాస, భాజపా, ఎంఐఎంలు ఒకే రకమైన భాష వాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెరాస రిమోట్‌ను కాపాడే ప్రయత్నంలో భాజపా బయటకు వచ్చిందని ఆరోపించారు. భాజపాకు పరోక్షంగా సహకరిస్తున్న ఎంఐఎం బయటకొచ్చిందని అన్నారు. అసదుద్దీన్‌ ఓవైసీ భాజపా ఏజంట్‌గా రాహుల్‌పై విమర్శలు చేశారా అని ప్రశ్నించారు. ఈ మూడు పార్టీల వ్యవహారాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని వెల్లడించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమరవీరుల స్థూపాన్ని అద్భుతంగా నిర్మిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. 60 కోట్లతో మొదలైన అమరవీరుల స్థూపం నిర్మాణం ఇవాళ 200 కోట్లకు పెంచారని విమర్శించారు. యాదాద్రి గుడి పేరుతో 2000 వేల కోట్లును దోచుకున్నారని ధ్వజమొత్తారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే యాదగిరిగుట్ట, అమరవీరుల స్థూపం రెండింటి అవినీతిపై విచారణ చేయించి దోసులను శిక్షిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : రాజకీయ పర్యాటకులు వస్తుంటారు.. పోతుంటారు: కేటీఆర్​

రూ.180 చెప్పులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు.. నవ్వుకున్న పోలీసులే చివరకు...

Last Updated : May 8, 2022, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.