ETV Bharat / city

Idupulapaya IIIT: ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో అధికారుల చర్చలు సఫలం - ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు

Idupulapaya IIIT students withdrew protests: ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపడుతున్న ఆందోళనను విరమించారు. విద్యార్థుల సమస్యలపై ఉదయం నుంచి అధికారులు వారితో చర్చలు జరిపి.. పరిష్కారానికి రావడంతో ఆందోళన సద్దుమణిగింది.

Idupulapaya IIIT
ఇడుపులపాయ ట్రిపుల్ఐటీ
author img

By

Published : Mar 22, 2022, 4:03 PM IST

Idupulapaya IIIT students withdrew protests: ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో అధికారుల చర్చలు సఫలమయ్యాయి. ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని అధికారులు హామీ ఇవ్వటంతో.. మూడు రోజులుగా చేస్తున్న ఆందోళనలను విద్యార్థులు విరమించారు. ఆర్జీయూకేటీ (RJUKT) ఛాన్సలర్‌ కె.సి.రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీవో, పాడా ఓఎస్డీ.. ఉదయం నుంచి విద్యార్థులతో చర్చలు జరిపారు.

అసలు వివాదం ఏంటంటే?

కనీస వసతులు కూడా కల్పించకుండా.. తమను కొత్త క్యాంపస్ నుంచి పాత క్యాంపస్​కు వెళ్లమని చెబుతున్నారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సరైన వసతులు కల్పించే వరకూ పాత క్యాంపస్‌కు వెళ్లబోమని తేల్చిచెప్పారు. ఉన్నఫళంగా పాత క్యాంపస్‌లోకి వెళ్లాలంటూ శనివారం రాత్రి 9 గంటలకు డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యారాణి చెప్పారని.. అప్పటినుంచి వివాదం చెలరేగిందని విద్యార్థులు పేర్కొన్నారు.

3 నెలలుగా కొత్త క్యాంపస్‌లో ఉంటున్నామని.. రాత్రికి రాత్రే లగేజీ, ఇతర సామగ్రిని ట్రాక్టర్లో పడేసి పాత క్యాంపస్‌కు తరలించారని వాపోయారు. విశ్రాంతి గదులు సరిగా లేకపోవడం, తలుపుల్లేని మరుగుదొడ్లు, ఇతర వసతులు లేవని... దీనివల్ల శనివారం రాత్రంతా నిద్ర కూడా లేదని ఆవేదన చెందారు. ఈ విషయం తెలుసుకుని ఆదివారం ఇడుపులపాయ వచ్చిన తల్లిదండ్రులు.. డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యారాణిని నిలదీయడంతో ఆమె దురుసుగా ప్రవర్తించారని చెప్పారు.

సంబంధిత కథనాలు: Jagga Reddy About Revanth : 'రేవంత్ నాకు ఝలక్ ఇవ్వడం కాదు.. నేనే ఇస్తా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.