ETV Bharat / city

Bank Jobs: 10 వేల పోస్టులకు ఐబీపీఎస్​ నోటిఫికేషన్​.! - hyderabad news

బ్యాంకు కొలువులను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు శుభ వార్త! గ్రామీణ బ్యాంకుల్లో 10 వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు ఐబీపీఎస్‌ ప్రకటన వెలువరించింది. ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్లు (క్లర్కులు) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇతర బ్యాంకు పరీక్షలతో పోలిస్తే తక్కువ స్థాయిలో ప్రశ్నలుండే ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ పరీక్షకు ప్రణాళికతో సన్నద్ధమైతే విజయం సాధించవచ్చు!

bank jobs  ibps notification
బ్యాంకు ఉద్యోగాలకు ఐబీపీఎస్​ నోటిఫికేషన్​
author img

By

Published : Jun 13, 2021, 11:11 AM IST

తెలుగురాష్ట్రాల్లోని పలు గ్రామీణ బ్యాంకుల ఉద్యోగాలకు ఐబీపీఎస్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఇప్పటివరకూ ఐబీపీఎస్‌కి ఖాళీల వివరాలను బ్యాంకులు తెలియజేసిన ప్రకారం- దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల ఆఫీసు అసిస్టెంట్లు, 4 వేలకు పైగా ఆఫీసర్‌ (స్కేల్‌-1, 2, 3) పోస్టులు భర్తీ అవనున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 343 ఆఫీసు అసిస్టెంట్లు, 82 ఆఫీసర్‌ స్కేల్‌-1 ఖాళీలున్నాయి. తెలంగాణలో 407 ఆఫీస్‌ అసిస్టెంట్లు, 89 స్కేల్‌-1 ఆఫీసర్‌ ఖాళీలు భర్తీ అవనున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాళీల వివరాలను ఇంకా తెలియజేయలేదు. వీటిని నియామకాలు జరిగే సమయానికి తెలియజేసే అవకాశం ఉంది. ఇతర బ్యాంకులలోనూ ఖాళీల సంఖ్య పెరిగే అవకాశముంటుంది. కాబట్టి నియామకం జరిగే సమయానికి వీటి సంఖ్య పెరగొచ్చు.

చివరి సంవత్సరం/ సెమిస్టర్‌ వారికి అవకాశం?

దరఖాస్తు చేసుకోవడానికి కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్‌. అయితే దరఖాస్తుకు చివరి తేదీ అయిన 28, జూన్‌ 2021 లోగా గ్రాడ్యుయేషన్‌ పూర్తయి ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కొవిడ్‌ వల్ల విధించిన లాక్‌డౌన్‌ కారణంగా డిగ్రీ చివరి సంవత్సరం/ సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులకు ఆ సమయంలోగా డిగ్రీ పరీక్షలు పూర్తయి ఫలితాలు తెలియడం కష్టం. కాబట్టి వారికి ఈ నోటిఫికేషన్‌తో అవకాశం లేనట్టే. అయితే గత సంవత్సరం ఇలాంటి పరిస్థితుల కారణంగానే ఐబీపీఎస్‌ నవంబరులో దీనికి అనుబంధ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సంవత్సరం కూడా అనుబంధ నోటిఫికేషన్‌ వెలువడితే చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మార్పు లేని పరీక్ష విధానం: ఎంపిక విధానం, పరీక్షా విధానం గత సంవత్సరం మాదిరిగానే ఉంది. ఎలాంటి మార్పూ లేదు.

ఎంపిక విధానం

ఆఫీస్‌ అసిస్టెంట్లు, స్కేల్‌-1 ఆఫీసర్ల ఎంపిక విధానంలో రెండంచెల రాత పరీక్ష ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్‌. ప్రిలిమినరీ అర్హత పరీక్ష. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మెయిన్స్‌ పరీక్ష ఉంటుంది. దానిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆఫీస్‌ అసిస్టెంట్ల ఎంపిక ఉంటుంది. అయితే స్కేల్‌-1 ఆఫీసర్ల భర్తీకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మెయిన్స్‌ పరీక్ష, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.స్కేల్‌-2, స్కేల్‌-3 ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఒకే రాత పరీక్ష (సింగిల్‌ ఎగ్జామినేషన్‌), ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

ఆఫీస్‌ అసిస్టెంట్, స్కేల్‌-1 ఆఫీసర్ల పరీక్షలు ఒకే విధం:

ఆఫీస్‌ అసిస్టెంట్, స్కేల్‌-1 ఆఫీసర్ల ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు ఒకే విధంగా ఉంటాయి. ఆఫీస్‌ అసిస్టెంట్ల పరీక్షలో న్యూమరికల్‌ ఎబిలిటీ సెక్షన్‌ ఉండగా, స్కేల్‌-1 ఆఫీసర్ల పరీక్షలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఉంటుంది. ఇది మినహా ప్రశ్నల సంఖ్య, విభాగాలు, మార్కులు, సమయం అంతా ఒకే విధం. ప్రశ్నల స్థాయిలో తేడా మినహా న్యూమరికల్‌ ఎబిలిటీ, క్యాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ల మధ్య పెద్దగా తేడా ఉండదు. ఎక్కువ స్థాయిలో ఉండే స్కేల్‌-1 ఆఫీసర్ల పరీక్షకు ప్రిపేర్‌ అయితే కొద్దిగా తక్కువ స్థాయిలో ఉన్న ఆఫీస్‌ అసిస్టెంట్ల పరీక్షకు సిద్ధమైనట్లే.

తొలిసారి పరీక్ష రాసేవారికి సమయం సరిపోతుందా?:

ఇతర బ్యాంకు పరీక్షలతో పోలిస్తే ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ పీఓ, కర్క్‌ ప్రిలిమినరీ పరీక్షలో తక్కువ సబ్జెక్టులున్నాయి. ఆప్టిట్యూడ్, రీజనింగ్‌లు మాత్రమే ఉన్నాయి. అవికూడా మిగిలిన పరీక్షల కంటే తక్కువ స్థాయిలో ఉంటాయి. ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ స్కేల్‌-1 ఆఫీసర్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు మొదటి వారంలో, క్లర్క్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష మూడో వారంలో ఉంటాయి. ఆఫీసర్స్‌ పరీక్ష నాటికి 50 రోజుల సమయం ఉంటుంది. ఈ సమయం మొదటిసారి పరీక్ష రాసేవారికి సరిపోతుంది. ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ విభాగాలలోని అన్ని టాపిక్స్‌ 20-25 రోజుల్లో పూర్తి చేసుకోవచ్చు. మిగిలిన సమయమంతా ప్రాక్టీస్‌కు సరిపోతుంది. కాబట్టి మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులకు కూడా ఈ పరీక్షలో విజయం సాధించడానికి సరిపోయే సమయం ఉంది.

పరీక్షా విధానం

1 క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ న్యూమరికల్‌ ఎబిలిటీ

ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలోనూ టాపిక్స్‌లో పెద్దగా తేడా ఉండదు. కానీ ప్రశ్నల స్థాయిలో భేదముంటుంది. సింప్లిఫికేషన్స్‌/ అప్రాక్సిమేట్‌ వేల్యూస్‌ నుంచి 10-12 ప్రశ్నలు ఆఫీస్‌ అసిస్టెంట్‌ పేపర్‌లో, దాదాపు 5 ప్రశ్నలు స్కేల్‌-1 ఆఫీసర్‌ పరీక్షలో ఉంటాయి. నంబర్‌ సిరీస్‌-5, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్‌-5, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 5-10, అరిథ్‌మెటిక్‌ ప్రశ్నలు 5-10 రెండింటిలోనూ ఉంటాయి.

2 రీజనింగ్‌

ఈ విభాగంలో ఎక్కువ ప్రశ్నలు సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్, పజిల్స్‌ నుంచి ఉంటాయి. దాదాపు 15-20 ప్రశ్నలు ఈ రెండింటి నుంచే ఉంటాయి. ఇనీక్వాలిటీస్‌ (4-5), కోడింగ్‌-డీకోడింగ్‌ (3-5), ఆల్ఫాబెటికల్‌ సీక్వెన్స్‌ (3-5), సిలాజిజమ్‌ (3-5), బ్లడ్‌ రిలేషన్స్‌ (3-4), డైరెక్షన్స్‌ (2-3) నుంచి ఇతర ప్రశ్నలుంటాయి. మెయిన్స్‌లో వీటితోపాటుగా లాజికల్‌ రీజనింగ్‌ నుంచి స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నలు, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్, కాజ్‌-ఎఫెక్ట్‌ మొదలైనవి ఉంటాయి.

3 ఇంగ్లిష్‌

మెయిన్స్‌లో మాత్రమే ఉండే విభాగంలో గ్రామర్‌ ఆధార ప్రశ్నలు, ఒకాబులరీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (7-10), ఒకాబులరీ (3-5) లతోపాటు గ్రామర్‌ ఆధారంగా ఉండే జంబుల్డ్‌ సెంటెన్సెస్, రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, క్లాజ్‌ టెస్ట్, ఫిల్లింగ్‌ ద బ్లాంక్స్, సెంటెన్స్‌ కరెక్షన్‌ మొదలైన మోడల్‌ ప్రశ్నలు ఉంటాయి.

4 జనరల్‌ అవేర్‌నెస్‌

బ్యాంకింగ్, ఎకానమీ, ఫైనాన్స్‌ రంగాలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షకు 5-6 నెలల ముందు వరకు ఉన్న వాటి నుంచి సాధారణంగా ప్రశ్నలుంటాయి. వీటితో పాటుగా జాతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ స్కీములు, జాతీయ/అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ముఖ్యమైన జాతీయ /అంతర్జాతీయ దినోత్సవాలు, పుస్తకాలు-రచయితలు, ప్రదేశాలు, వ్యక్తులు, బ్యాంకుల ట్యాగ్‌లైన్లు చూసుకోవాలి.

5 కంప్యూటర్‌ నాలెడ్జి

మెయిన్స్‌లో ఉండే ఈ విభాగంలో 40 ప్రశ్నలు 20 మార్కులకు ఉంటాయి. కంప్యూటర్స్‌ ఎవల్యూషన్,. బేసిక్స్, ఆపరేటింగ్‌ సిస్టమ్స్, ఎంఎస్‌ ఆఫీస్, ఇంటర్నెట్, వైరస్‌లు, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్, డిజిటల్‌ మార్కెటింగ్, కంప్యూటర్‌ రంగంలో తాజా పరిణామాలు, ఫ్లోచార్ట్‌లపై ప్రశ్నలుంటాయి.

తెలుగులోనూ...

బ్యాంకు పరీక్షలన్నీ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. అయితే గ్రామీణ బ్యాంకుల్లో నియామకాలకు ఐబీపీఎస్‌ నిర్వహించే ఆర్‌ఆర్‌బీ స్కేల్‌-1 ఆఫీసర్, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పరీక్షలు మాత్రం దేశీయంగా గుర్తింపు పొందిన భాషలన్నింటిలోనూ ప్రశ్నపత్రం రూపొందిస్తారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వీటిని తెలుగులోనూ రాసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు ఇంగ్లిష్, హిందీ, తెలుగు మాధ్యమాల్లో రాసుకునే అవకాశం ఉంది. తెలంగాణ వారికి వీటితోపాటు ఉర్దూలో రాసుకునే సౌకర్యం కల్పించారు.

సన్నద్ధత తీరు ఇదీ

ఇతర బ్యాంకు పరీక్షలతో పోలిస్తే ప్రశ్నల స్థాయి తక్కువే. ప్రిలిమ్స్‌లో రెండే విభాగాలు ఉన్నాయి. అయితే అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండూ కలిపి ఉమ్మడిగా కొనసాగించాలి.
ఒకవేళ తొలిసారి పరీక్షలు రాసే అభ్యర్థులైతే మొదటగా 20-25 రోజుల్లో అన్ని అంశాలూ చదువుకోవాలి. ఎక్కువ మార్కులు సాధించడానికి అనువైన అంశాలను ముందుగా పూర్తిచేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన అంశాలు అధ్యయనం చేయాలి. అనంతరం మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. దీనివల్ల పరీక్ష విధానానికి అలవాటు పడడమే కాకుండా నిర్ణీత సమయంలో ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుస్తుంది. ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు గుర్తించి, సన్నద్ధతలో మార్పులు చేసుకోవాలి. తప్పులు జరుగుతున్న అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. ఇలా మాదిరి ప్రశ్నపత్రాలను విశ్లేషించుకుంటూ పరీక్షకు సిద్ధమైతే తక్కువ వ్యవధిలోనే అంశాలపై, సమయ పాలనపై పట్టు సాధించవచ్చు.

రోజూ 12 గంటలకు తక్కువ కాకుండా సన్నద్ధం కావాలి. మోడల్‌ పేపర్‌ రాసే సమయాన్ని మినహాయించి, మిగిలిన సమయంలో 40 శాతం ఆప్టిట్యూడ్‌కి, 30 శాతం రీజనింగ్‌కి, 20 శాతం ఇంగ్లిష్‌కి, 10 శాతం జనరల్‌ అవేర్‌నెస్‌కీ కేటాయించుకోవాలి. అలాగే రోజూ గంట సమయం ఆంగ్ల దినపత్రికలు చదవడానికి వెచ్చించాలి. ఇలా చేయడం వల్ల ఆంగ్లంతోపాటు, జనరల్‌ అవేర్‌నెస్‌ సన్నద్ధతకు ఉపయోగపడుతుంది.

పరీక్ష సులువుగానే ఉంటుంది కాబట్టి కటాఫ్‌ మార్కులూ ఎక్కువగానే ఉంటాయని గమనించాలి. అందువల్ల పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. తొలిరోజు ఉండే ప్రేరణను పరీక్ష రాసే వరకు కొనసాగించాలి. అలా ఆచరిస్తేనే విజయం సాధ్యమవుతుంది. - డా. జీఎస్‌ గిరిధర్‌

ఇదీ చదవండి: Kaveri seeds chief: సాగు చేస్తానంటే నాన్న సంతోషపడ్డారు.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.