ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లు బదిలీ (IAS Transfers) అయ్యారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గా ఉన్న ఇంతియాజ్ (Inthiyaz)ను బదిలీ చేస్తూ.. మైనారిటీ సంక్షేమ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఎల్‌ఎస్ బాలాజీరావు, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా నాగలక్ష్మి నియమితులయ్యారు. గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా గంధం చంద్రుడు(gandham chandrudu)ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పలువురు జేసీలకు బాధ్యతలు:
- పాడేరు ఐటీడీఏ పీవోగా- గోపాలకృష్ణ రోణంకి
- ప్రకాశం జిల్లా జేసీగా (హౌసింగ్) కె.ఎస్.విశ్వనాథన్
- కడప జిల్లా జేసీగా (హౌసింగ్) ధ్యానచంద్ర
- తూ.గో. జిల్లా జేసీగా (హౌసింగ్) జాహ్నవి
- కర్నూలు జిల్లా జేసీగా (హౌసింగ్) ఎన్.మౌర్య
- కృష్ణా జిల్లా జేసీగా (హౌసింగ్) నుపుర్ అజయ్‌కుమార్
- గుంటూరు జిల్లా జేసీగా (హౌసింగ్) అనుపమ అంజలి
- నెల్లూరు జిల్లా జేసీగా (హౌసింగ్) విదేహ కరే
- చిత్తూరు జిల్లా జేసీగా (హౌసింగ్) ఎస్.వెంకటేశ్వర్
- ప.గో. జిల్లా జేసీగా (హౌసింగ్) జి.ఎస్. ధనుంజయ్
- విశాఖ జిల్లా జేసీగా (హౌసింగ్) కల్పనా కుమారి
- విజయనగరం జిల్లా జేసీగా (హౌసింగ్) మయూర్ అశోక్
- శ్రీకాకుళం జిల్లా జేసీగా (హౌసింగ్) హిమాన్షు కౌశిక్
ఇదీ చదవండి: global tenders: కొవిడ్ టీకాల కోసం గ్లోబల్ టెండర్లకు ముందుకు రాని సంస్థలు