భారత్ వంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో... కరోనా వ్యాప్తి నివారణ కత్తిమీద సాము లాంటిదే. అందుకే యావత్ ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది. ఇలాంటి తరుణంలో కేరళ కరోనా వైరస్‌ను తరమికొడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య కట్టడి చేస్తూనే... అక్కడి ప్రజలకు భరోసా ఇస్తోంది. కరోనా నియంత్రణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ప్రపంచ దేశాల దృష్టినీ ఆకర్షిస్తున్న కేరళ విజయం వెనక ప్రణాళికలను... ఆ రాష్ట్ర పర్యాటకశాఖ ఏడీజీ, యువ ఐఏఎస్ కృష్ణతేజ... ఈటీవీ-భారత్తో పంచుకున్నారు.
ఇదీ చదవండి: కరోనాపై సహాయానికి 'కొవిడ్ ఇండియా సేవా'