లాక్డౌన్ సడలింపుతో నగరంలో నేరాలు పెరిగాయి. ముఖ్యంగా గ్యాంగ్ వార్లు ఎక్కువ సంఖ్యలో జరుగుతుండటం వల్ల పోలీసులు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెలలో దక్షిణ, పశ్చిమ మండలాల్లోనే హత్యలు ఎక్కువగా జరగటం కలవరపెడుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని రౌడీషీటర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగి ఉంటే రౌడీషీట్లు ఎత్తివేస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హామీ ఇచ్చారు. దీనిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. రౌడీషీట్లు నమోదైతే భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగం లభించదని, అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.