ETV Bharat / city

"ఈఎస్​ఐ" కుమ్మక్కయ్యారు... కోట్లు మింగారు..! - esi fraud

తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతూనే  ఉన్నాయి. బీమా వైద్య సేవల పథకం నిధుల స్వాహాలో చిన్న స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరి స్థాయిలో వారు అందినంత వరకు దోచుకున్నట్లు అనిశా అనుమానిస్తోంది. ఇప్పటి వరకు నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించిన దర్యాప్తు బృందం... కీలక ఆధారాలు సేకరించింది. ఇంటి దొంగల సాయంలేకుండా ఇన్ని అక్రమాలు ఎలా జరుగుతాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

ఈఎస్​ఐ కుమ్మక్కయ్యారు... కోట్లు మింగారు..!
author img

By

Published : Oct 11, 2019, 5:23 AM IST

Updated : Oct 11, 2019, 7:34 AM IST

ఈఎస్​ఐ కుమ్మక్కయ్యారు... కోట్లు మింగారు..!

ఈఎస్​ఐలో అనినీతి తిష్ట వేసింది. కార్మికులు, వారి కుటుంబాలకు వైద్యసేవలు అందించాల్సిన విభాగం అక్రమాలకు అడ్డాగా మారింది. అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, ఫార్మా సంస్థల ప్రతినిధులు అంతా కుమ్మక్కై కోట్ల రూపాయలు దండుకున్నట్లు అవినీతి నిరోధకశాఖ విచారణలో తేలింది. కార్మికుల వైద్య చికిత్సలకు ఒక్క రూపాయి మంజూరు కావాలన్నా, ఖర్చు కావాలన్నా... అనేక నిబంధనలున్నాయి. వాటిని అధికారులు పూర్తిగా పక్కనపెట్టి ఇష్టానుసారం వ్యవహరించారు.

నీకింత.. నాకింత..!

ఐదేళ్ల నుంచి ఇదే రీతిలో అందినంత దండుకున్నారు. అక్రమ సంపాదనలో వాటాలు వేసి మరీ పంచుకున్నారు. ఇన్నేళ్లుగా ఈ తంతు సాగుతున్నా ఉన్నతాధికారులు, ఆడిట్‌ అధికారులు, కార్మికశాఖ పెద్దలకు ఎందుకు అనుమానం రాలేదనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఏడుగురు నిందితులను లోతుగా విచారించిన అనిశా.. కీలక ఆధారాలు సేకరించింది. దోచుకున్న డబ్బును ఉన్నతాధికారులకు పంచటం వల్లే ఇన్ని రోజులు విషయం బయటికి రాలేదని అధికారులు భావిస్తున్నారు.

ఆడిట్‌ అధికారుల నిర్లక్ష్యం

నిధుల వినియోగం తీరును ఆడిట్ అధికారులు పర్యవేక్షిస్తారు. ఇక్కడ మాత్రం వారు కార్యాలయాలకు పరిమితమయ్యారు. డిస్పెన్సరీల స్థాయిలో రికార్డులు పరిశీలిస్తే గుట్టు రట్టయ్యేది. కేసు దర్యాప్తులో అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్న దస్త్రాల పరిశీలనలో నకిలీ ఇండెంట్లు గుర్తించారు. వాటిని దస్త్రాల మధ్య పేజీల్లో అతికించినట్టు గుర్తించారు. ఈ విషయం ఆడిట్‌ అధికారులు ఎందుకు గమనించలేదన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పరిపాలన వైఫల్యం...

పెద్ద మొత్తంలో మందులను ప్రైవేట్‌ ఆసుపత్రులకు విక్రయించారు. వీటిపై అనిశా కేసులు నమోదు చేయనుంది. అధికారుల ప్రశ్నలకు దేవికారాణి సరైన సమాధానాలు చెప్పలేదని... పరిపాలన వైఫల్యం వల్లే పొరపాట్లు జరిగాయని చెప్పినట్టు సమాచారం. మందుల కొనుగోలు కుంభకోణంలో అనిశా అధికారుల రెండు రోజుల కస్టడీ ముగియడం వల్ల నిందితులను కోర్టులో హాజరుపరిచి తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇవీ చూడండి: ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండేలా కృషి చేస్తా'

Intro:Body:Conclusion:
Last Updated : Oct 11, 2019, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.