భాగ్యనగరవాసుల వారాంతపు విహారానికి ట్యాంక్‌బండ్ ఇస్తున్న జోష్ అంతా ఇంతా కాదు.. దీనికి తోడు చార్మినార్(Charminar as Weekend Spot in Hyderabad) వద్దా అవకాశం కల్పించాలంటూ నగరవాసుల నుంచి పెద్దఎత్తున వినతులొస్తున్నాయి. వీటికి ప్రభుత్వం స్పందించింది. సోమవారం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ స్పష్టతనిచ్చారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్(Telangana Minister KTR), ఎంపీ అసదుద్దీన్ ఒవైసీల సూచన మేరకు ఇక్కడా వారాంతపు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఎలాంటి వేడుకలు చేద్దాం.. ఏమేం కావాలో సలహాలు, సూచనలివ్వాలంటూ నగరవాసుల్ని కోరారు.
-
Minister @KTRTRS & MP #Hyderabad Janab @asadowaisi Saab, noticing the overwhelming response to Sunday-Funday at #Tankbund have suggested that a similar event can be planned at #Charminar every Sunday!
— Arvind Kumar (@arvindkumar_ias) October 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Suggestions / advice welcome so that we can plan accordingly pic.twitter.com/FC41EMhKOM
">Minister @KTRTRS & MP #Hyderabad Janab @asadowaisi Saab, noticing the overwhelming response to Sunday-Funday at #Tankbund have suggested that a similar event can be planned at #Charminar every Sunday!
— Arvind Kumar (@arvindkumar_ias) October 11, 2021
Suggestions / advice welcome so that we can plan accordingly pic.twitter.com/FC41EMhKOMMinister @KTRTRS & MP #Hyderabad Janab @asadowaisi Saab, noticing the overwhelming response to Sunday-Funday at #Tankbund have suggested that a similar event can be planned at #Charminar every Sunday!
— Arvind Kumar (@arvindkumar_ias) October 11, 2021
Suggestions / advice welcome so that we can plan accordingly pic.twitter.com/FC41EMhKOM
దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. మూసీ నుంచి ఇక్కడి దాకా నడకదారినివ్వాలని కొందరు కోరగా.. అక్కడి దుకాణాల్ని అలాగే ఉంచి మదీనా నుంచే రాకపోకలు పూర్తిగా నిలిపేయాలని కొందరు, ట్రాఫిక్ రద్దీ, వాహనాల పార్కింగ్ విషయాల్ని మరిచిపోవద్దంటూ చాలామంది సూచనలిస్తున్నారు. గండిపేట జలాశయం వద్దా ఇలాంటి కార్యక్రమాలు చేయండంటూ కొందరు నగరవాసులు కోరారు.