ETV Bharat / city

హైదరాబాద్​ మెట్రో ఘనత.. గ్రీన్​ఛానల్​ ద్వారా మరోసారి గుండె తరలింపు - గ్రీన్‌ఛానల్‌ను ఏర్పాటు చేసిన మెట్రో

Green channel in Hyderabad: ఎల్అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో మరోసారి గ్రీన్‌ ఛానల్ ఏర్పాటు చేసి.. ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టింది. నిన్న రాత్రి మెట్రో రైల్లో నాగోల్ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో స్టేషన్‌కు కామినేని ఆస్పత్రి వైద్యులు గుండెను తరలించారు. కేవలం 25 నిమిషాల్లో మెట్రోలో గుండెను తరలించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు.

Green channel
Green channel
author img

By

Published : Sep 26, 2022, 6:42 PM IST

Green channel in Hyderabad: హైదరాబాద్​ నగర వాసులకు అవసరమైన సాయం చేసేందుకు తామెప్పుడు ముందుంటామని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో నిరూపించింది. గ్రీన్​ఛానల్‌ను ఏర్పాటుచేసి నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ వరకు ఓ గుండెను తరలించి నిండు ప్రాణాన్ని ఆదుకుంది. ఎల్బీనగర్‌లోని కామినేని హాస్పిటల్‌ వైద్యులు, ఇతర సిబ్బంది అర్ధరాత్రి ఒంటిగంటకు నాగ్‌ల్‌లోని మెట్రో స్టేషన్‌కు గుండెను తీసుకురాగా... కేవలం 25 నిమిషాల్లోనే ప్రత్యేక రైలు జూబ్లిహిల్స్‌ చెక్‌పోస్టుకు చేరింది.

అక్కడ ఉన్న అపోలో హాస్పిటల్‌ అంబులెన్స్‌ దానిని హాస్పిటల్‌కు చేర్చింది. గత ఏడాది ఫిబ్రవరిలో కూడా జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రి నుంచి గుండెను తరలించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. ప్రయాణికులకు మెట్రో సేవలతో పాటు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడమే తమ సిద్ధాంతమని ఎల్‌ఆండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ కేవీబీ రెడ్డి పేర్కొన్నారు. ఈ సారి కూడా తాము గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటు చేయడంతో వీలైనంత త్వరగా గుండెను తరలించి.. ఓ ప్రాణం కాపాడామని తెలిపారు. ప్రాణంతో ఉన్న అవయవాన్ని తరలించడంలో తోడ్పడిన డాక్టర్లు, హెచ్‌ఎంఆర్‌ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

గ్రీన్‌ఛానల్‌ను ఏర్పాటు చేసిన నిండు ప్రాణాన్ని కాపాడిన మెట్రో

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.