రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానంగా దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు ప్రదేశాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. నిన్న మరట్వాడా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీన పడిందన్నారు.
ఇవాళ ఉత్తర-తూర్పు ఉపరితల ఆవర్తనం మరట్వాడా నుంచి కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా తమిళనాడు వరకు ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ అధికారులు వివరించారు. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
- ఇదీ చదవండి : రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు