ETV Bharat / city

హైదరాబాద్​ వేదికగా ప్రపంచ వైమానిక సదస్సు - వైమానిక సదస్సు

హైదరాబాద్ వేదికగా మార్చి నెలలో జరగనున్న వింగ్స్ ఇండియా-2020 కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమ సన్నాహక సమావేశం రేపు దిల్లీలో జరగనున్న నేపథ్యంలో గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించాల్సిందిగా మంత్రి కేటీఆర్​ను పౌర విమానయాన మంత్రి హర్దీప్​ సింగ్ పూరీ ఆహ్వనించారు.

హైదరాబాద్​ వేదికగా ప్రపంచ వైమానిక సదస్సు
హైదరాబాద్​ వేదికగా ప్రపంచ వైమానిక సదస్సు
author img

By

Published : Jan 8, 2020, 12:42 PM IST

మార్చిలో హైదరాబాద్ వేదికగా జరగనున్న వింగ్స్ ఇండియాకు సంబంధించి రేపు దిల్లీలో సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించాలని పరిశ్రమలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆహ్వానించారు. ఈ మేరకు కేటీఆర్​కు ఆహ్వానం పంపిన కేంద్రమంత్రి... వింగ్స్ ఇండియా కార్యక్రమం దేశ వైమానిక రంగాన్ని అంతర్జాతీయంగా ప్రముఖంగా నిలబెడుతుందన్నారు. దేశ వైమానిక రంగంలో తెలంగాణ పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వేదికగా 'వింగ్స్ ఇండియా-2020' కార్యక్రమం జరగనుంది. కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వైమానిక సదస్సు కూడా నిర్వహించనుంది. సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎయిర్ లైన్స్, విమాన తయారీ సంస్థలు, కార్గో, స్పేస్ ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులు, పెట్టుబడిదారులు, వైమానిక రంగ ప్రతినిధులు హాజరు కానున్నారు.

ప్రపంచ వైమానిక సదస్సు ద్వారా దేశంలోని ఎయిరోస్పేస్ రంగంలో ఉన్న అవకాశాలను ప్రపంచ కంపెనీలకు తెలిపే అవకాశం కలుగుతుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో రేపు దిల్లీ వేదికగా జరగనున్న సన్నాహక సమావేశంలో పౌరవిమానయాన శాఖతో పాటు కేంద్ర వ్యాపార వాణిజ్య శాఖ అధికారులు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.

ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ

File : TG_Hyd_28_08_KTR_WingsIndia_Meeting_Dry_3053262 From : Raghu Vardhan ( ) మార్చిలో హైదరాబాద్ వేదికగా జరగనున్న వింగ్స్ ఇండియాకు సంబంధించి రేపు దిల్లీలో సన్నాహక సమావేశం జరగనుంది. సన్నహాక సమావేశంలో గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించాలని పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆహ్వానించారు. ఈ మేరకు కేటీఆర్ కు ఆహ్వానం పంపిన కేంద్రమంత్రి... వింగ్స్ ఇండియా కార్యక్రమం దేశ వైమానిక రంగాన్ని అంతర్జాతీయంగా ప్రముఖంగా నిలబెడుతుందని అన్నారు. దేశ వైమానిక రంగంలో తెలంగాణ పాత్ర కీలకమన్న ఆయన... వింగ్స్ ఇండియాకు ఆతిథ్యం రాష్ర్ట ప్రతినిధిగా సమావేశానికి గౌరవఅతిథిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వేదికగా వింగ్స్ ఇండియా 2020 కార్యక్రమం జరగనుంది. కార్యక్రమంలో భాగంగా ప్రపంచ వైమానిక సదస్సు కూడా నిర్వహించనున్నారు. సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ లైన్స్, విమానతయారీ సంస్థలు, కార్గో, స్పేస్ ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులు, పెట్టుబడీదారులు, వైమానిక రంగ ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు ద్వారా దేశంలోని ఎయిరోస్పేస్ రంగంలో ఉన్న అవకాశాలను ప్రపంచ కంపెనీలకు తెలిపే అవకాశం కలుగుతుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో రేపు దిల్లీ వేదికగా జరగనున్న సన్నాహక సమావేశంలో పౌరవిమానయాన శాఖతో పాటు కేంద్ర వ్యాపార వాణిజ్య శాఖ సహా వివిధ శాఖల అధికారులు, వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు హజరు కానున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.