హైదరాబాద్‌కి చెందిన అరవింద్ ఇక్కడేబీటెక్ చదివాడు. విదేశాల్లో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశాడు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. అరవింద్‌కి వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనే కోరిక బలంగా ఉండేది. అందుకే.. విదేశాలకెళ్లి బిజినెస్ మాస్టర్స్ చదివాడు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగివచ్చాడు. ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తునే.. వ్యాపారం చేయాలనే ఆకాంక్షతో యాప్‌ను రూపొందించాడు.
ఐడియా ఇలా వచ్చింది!
అరవింద్ పని చేసే ఆఫీస్‌లో పార్కింగ్ కోసం నెలకు 2 వేలు కడుతున్నాడు. అప్పుడే.. అరవింద్‌కి ఓ ఐడియా వచ్చింది. అపార్ట్మెంట్లలో ఖాళీస్థలం ఉన్న వాళ్లు దాన్ని పార్కింగ్ కోసం అద్దెకిస్తే ఆదాయం వస్తుంది కదా అని ఆలోచించాడు. గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్లలో ఉంటూ సొంత వాహనం లేని వారు, వారి వాహనానికి పార్కింగ్ అవసరం లేని సమయంలో స్థలాన్ని అద్దెకి ఇవ్వవచ్చు. అలా చేయాలనుకున్న వాళ్లకోసం ఒక యాప్ డిజైన్ చేశాడు. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని రిజిష్టర్ చేసుకోవాలి. పార్కింగ్ స్థలం కావాల్సిన వాళ్లు కూడా యాప్‌ని ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ కావాలి. కొత్త ప్రాంతంలోకి వెళ్లిన వారు తమ వాహనాన్ని పార్క్ చేయాలనుకుంటే.. ఈ యాప్‌లో సెర్చ్ చేస్తే చేయాలి. లేదంటే.. ముందే బుక్ చేసి పెట్టోకోవచ్చు. ఇక స్థల యజమానులు కూడా తమ స్థలం పార్కింగ్ కోసం ఫలానా టైమ్‌లో ఖాళీగా ఉంటుంది అని యాప్‌లో అప్డేట్ పెట్టాలి. ఆ చుట్టుపక్కల వచ్చిన కొత్త వాహనాదారులకు ఆటోమేటిక్‌గా పార్కింగ్ స్థలం గురించి తెలిసిపోతుంది. బస్‌స్టాప్, రైల్వేస్టేషన్‌లోనూ యాప్‌ను వాడొచ్చు. అక్కడికి వెళ్లే ముందు పార్కింగ్ స్పేస్ ఉందో, లేదో చూసుకొని బుకింగ్ చేసుకోవచ్చు. వాహనదారులకు బాగా ఉపయోగపడే ఈ యాప్‌ను లాక్‌డౌన్ తర్వాత అందుబాటులోకి తీసుకురానున్నట్లు అరవింద్ చెప్పారు.
సొంతిల్లు అపార్ట్‌మెంట్, గేటేడ్ క్యమూనిటీస్ నివాస స్థలం ఏదైనా తప్పనిసరిగా పార్కింగ్ స్థలం ఉండేలా చూసుకుంటున. ఇంట్లో కారో, బైకో తప్పని సరిగా ఉంటుంది. ఉదయం ఆఫీసుకి వెళ్లాక ఆ పార్కింగ్ ప్లేస్ ఖాళీగా ఉంటుంది. ఆ ఏరియాకు వచ్చే వారికి పార్కింగ్ స్పేస్‌ని రెంటుకు ఇస్తే ఆదాయానికి ఆదాయం.. పార్కింగ్ సమస్యను పరిష్కరించినట్టు కూడా అవుతుంది అంటున్నాడు అరవింద్. అదే ప్లాన్‌తో పార్క్ ఇన్ జి యాప్‌ను డిజైన్ చేశాడు. పార్కింగ్ స్థలం ఉన్న యజమానులు గంటకు ఇంత అని యాప్‌లో పొందు పరుస్తారు. దానికి అనుగుణంగా అవసరం ఉన్న వారు వాడుకోవచ్చు. యాప్‌లో స్థల యజమాని వివరాలు, పార్కింగ్ స్థలం ఖాళీగా ఉండే సమయం, రేటు ఎంత అనే వివరాలుంటాయి. ట్రాఫిక్ వయోలేషన్, మానిటరైజింగ్ రిపోర్టింగ్‌పై రీసెర్చి చేస్తున్న అరవింద్ 6 నెలల అధ్యయనం తర్వాత ఈ యాప్ రూపొందించారు.
నగరంలో ఇంటి నుంచి వాహనంతో బయటకు వెళ్తే.. అన్నింటికంటే ఎదురయ్యవి.. ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులే. రోజురోజుకూ సొంత వాహనాల సంఖ్య పెరుగుతుండం వల్ల పార్కింగ్ స్పేస్ దొరకడం కష్టమవుతోంది. కొన్ని చోట్ల అవకాశం ఉన్న సెక్యూరిటీ ఉండదు. ఈ సమస్యకు పరిష్కరంగా అవసరం ఉన్నవారికి, పార్కింగ్ ఓనర్స్‌కి యాప్ డిజైన్ చేసినట్లు అరవింద్ చెబుతున్నాడు. లాక్‌డైన్‌తో పబ్లిక్ టాన్స్‌పోర్టేషన్ అగిపోవడం వల్ల.. బయటకు వెళ్లాలంటే అందరూ సొంత వాహనాల మీదనే ఆధారపడుతున్నారు. దీంతో పార్కింగ్ సమస్య మరింత పెరిగింది. ఈ పార్క్ ఇన్ జీ యాప్ ద్వారా పార్కింగ్ సమస్య తీరుతుందంటున్నాడు యాప్ రూపకర్త అరవింద్.
ఇవీచూడండి: 'రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తాం'