చిన్నారుల మధ్యలో బాలల దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. వెంగళ్రావునగర్లోని శిశువిహార్ను అదనపు సీపీ షికాగోయల్, సంయుక్త సీపీ తరుణ్జోషితో కలిసి ఆయన సందర్శించారు.
శిశువిహార్లో ఉంటున్న వీణా వాణీలతో సీపీ ప్రత్యేకంగా మాట్లాడారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారితో కేక్ కట్ చేయించారు. అనంతరం చిన్నారులందరికి పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. శిశువిహార్ నిర్వాహకులను అభినందించారు.
ఇవీచూడండి: పిల్లలుంటే ఇలా చేయండని చెబుతోన్న నాని