ETV Bharat / city

యుద్ధ విమానాల గర్జన, బాంబుల మోత.. బిక్కుబిక్కుమంటున్న హైదరాబాదీ విద్యార్థులు - ఉక్రెయిన్​లో రంగారెడ్డి విద్యార్థిని

Hyderabad students in Ukraine : యుద్ధ విమానాల బీభత్సం, బాంబుల మోత కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్‌ చిక్కుకున్న తెలుగు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. తమను స్వదేశానికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉన్న వారు ప్రశాంతంగా ఉన్నప్పటికీ.... రాజధాని కీవ్‌తో పాటు పరిసరాల్లో ఉన్న విద్యార్థులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు తమ పిల్లలను ఇంటికి రప్పించాలంటూ వారి కుటుంబసభ్యులు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

Hyderabad Students In Ukraine
Hyderabad Students In Ukraine
author img

By

Published : Feb 25, 2022, 3:49 PM IST

Updated : Feb 25, 2022, 4:41 PM IST

Hyderabad students in Ukraine : ఉక్రెయిన్‌పై సైనిక చర్య నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం గడువుతున్నారు. ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి వద్దామన్నా విమానాల రాకపోకలు ఆగిపోయాయి. ఉక్రెయిన్‌లో వేల మంది భారత విద్యార్థులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది వైద్యవిద్య అభ్యసిస్తున్నారు.

హైదరాబాద్​ సరూర్​నగర్​, ఆర్కేపురం ప్రాంతాలకు చెందిన ముగ్గురు విద్యార్థినిలు ఉక్రెయిన్​లోని వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. రెండు రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొనడంతో అక్కడ విద్యార్థులతో పాటు.. ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవతున్నారు. తమ పిల్లలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి : ఉక్రెయిన్‌ అలజడిలో విద్యార్థులు.. ఆందోళనలో వారి తల్లిదండ్రులు

ఆరు నెలల క్రితమే వెళ్లారు..

ముగ్గురు విద్యార్థునులు దివ్య, మేఘన, తేజస్విని... జఫరా జియాస్టేట్​ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్​ చదువుతున్నారు. కొవిడ్​ ఉద్ధృతి వల్ల ఇంటికి వచ్చేసిన వీరు.. పరిస్థితులు చక్కబడడంతో ఆరు నెలల క్రితం తిరిగి వెళ్లారు. ఈ సమయంలో అక్కడ యుద్ధవాతావరణం నెలకొనడంతో తీవ్ర ఆందోళన పడుతున్నారు.

Ukraine Student
ఉక్రెయిన్​లో ఎంబీబీఎస్​ చదువుతున్న విద్యార్థిని తేజస్విని

మా పిల్లలు చాలా భయపడుతున్నారు. భయటకు వెళ్లే పరిస్థితులు లేవంట. వాళ్లను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలి. - రాజా భాయి, దివ్య తల్లి

మాకు చాలా భయంగా ఉంది. నిన్నటి వరకు కొంచెం ధైర్యంగానే ఉన్నాము. అక్కడి పరిస్థితులు రోజు రోజుకు మారిపోవడంతో చాలా భయంగా ఉంది. వీలైనంత త్వరగా మా పిల్లలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మా పిల్లలను అక్కడికి పంపించి తప్పుచేశామనే బాధ కలుగుతోంది. -నాగజ్యోతి, మేఘన తల్లి

నిన్నటి నుంచి చాలా భయంగా ఉంది. నిత్యావసరాలు దొరకని పరిస్థితి లేదంట. నెట్​వర్క్​ కూడా అందుబాటులో ఉందడం లేదు. మా పిల్లలను స్వదేశానికి తీసుకొచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. సాయిబాబా, శ్రీవైష్ణవి తండ్రి

రెండు వారాల క్రితమే వెళ్లాడు..

హైదరాబాద్​ పాతబస్తీ దూద్​బౌలికి చెందిన మెడిసిన్​ విద్యార్థి రషీద్​ ఉక్రెయిన్​లో చిక్కుకుపోయాడు. గోషా మహల్ ఠాణాలో హెడ్​కానిస్టేబుల్​గా పనిచేస్తున్న షేక్ ఫరీద్-ఉద్-దిన్ కుమారుడు మెడిసిన్ చదువు కోసం రెండు వారాల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లాడు. ఇవానో-ఫ్రాంక్ వెస్క్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో చదువుతున్నాడు. ప్రస్తుతం అక్కడ యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో తల్లిదండ్రులు భయాందోళన పడుతున్నారు. తమ కుమారుడుని తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Ukraine Student
రషీద్​

ఇదీ చూడండి : 'సురక్షితంగానే ఉన్నాం.. కానీ.. ఏం జరుగుతుందో?'

మార్చి4న టికెట్​ బుక్​ చేశాం..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని మంచాలకు చెందిన దోమ సాయిబాబా, శోభారాణిల కుమార్తె శ్రీవైష్ణవి జప్రిజియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్​ చదువుతోంది. తమ కూతురును క్షేమంగా తీసుకురావాలని ఆమె తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

మా పాప ఉక్రెయిన్​లో ఎంబీబీఎస్​ నాలుగో సంవత్సరం చదువుతోంది. 2018లో అక్కడికి వెళ్లింది. 2024లో విద్యాభ్యాసం పూర్తవుతుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మా పాపను రప్పించేందుకు ప్రయత్నించగా విమాన టికెట్లు అందుబాటులో లేవు. మార్చి 4న టికెట్​ లభించింది. అయితే అక్కడ ఎప్పుడు ఏమవుతుందోనని భయపడాల్సి వస్తోంది. అక్కడ చదువుతున్న విద్యార్థులను త్వరగా తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. -శోభారాణి, శ్రీవైష్ణవి తల్లి, మంచాల, రంగారెడ్డి జిల్లా

Parents
ఆందోళనలో శ్రీవైష్ణవి తల్లిదండ్రులు

సుమారు 18 వేల మంది భారత విద్యార్థులు వైద్యవిద్య అభ్యసిస్తున్నారు. వీరిలో తెలుగు విద్యార్థులు 1500 మంది వరకు ఉంటారని అంచనా. ఉక్రెయిన్‌లో దాదాపు 50 వైద్య కళాశాలలున్నాయి. 19 వర్సిటీలకు భారత వైద్యమండలి గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు కీవ్‌, లుగాన్‌స్కీ, బ్లాక్‌సి, డోనెస్క్‌, ఖర్కీవ్‌, జాపోరిజియా, డాన్లో, హలేస్కీలీవ్‌, బుకోవినియన్‌ తదితర వర్సిటీల్లో చదువుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులు వర్సిటీ, రాయబార కార్యాలయ అధికారుల సూచనలతో హాస్టళ్లు దాటి బయటకు రావడం లేదు. ముందుజాగ్రత్తగా పది రోజులకు సరిపడా ఆహార పదార్థాలను సిద్ధంగా ఉంచుకున్నారు. వారితో రాయబార కార్యాలయ అధికారులు నిత్యం సంప్రదిస్తున్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు ధైర్యం చెబుతున్నా.. లోలోపల వారూ ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి : ఉక్రెయిన్​లో చిక్కుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు

Last Updated : Feb 25, 2022, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.