తూర్పుగోదావరి జిల్లా పాపికొండ పర్యాటకంలో జరిగిన బోటు ప్రమాద బాధితులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తెలంగాణ వాసులను కలుసుకుని ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు మంత్రి పువ్వాడ సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ బోటు ముంపు ఘటనా స్థలంలో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎనిమిది మృతదేహాలను గుర్తించి స్వస్థలాలకు చేరేవిదంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి పువ్వాడ వెల్లడించారు. బాధితుల్లో వరంగల్ జిల్లాకు చెందిన వారిలో ఐదుగురు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.
"మృతదేహాలు స్వస్థలాలకు చేరేవిధంగా చర్యలు"
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు. బోటు ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఘటనా స్థలంలో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.