Hussain Sagar water Level: నగరం నడిబొడ్డున పర్యాటకుల ఆకర్షణ కేంద్రంగా రాజిల్లుతున్న హుస్సేన్ సాగర్ జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం కన్నా ఎక్కువగా వరద నీరు చేరింది. పూర్తి స్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 513.50 మీటర్లకు చేరింది.
సాగర్ గరిష్ఠ నీటిమట్టం 514.75 మీటర్లు. గరిష్ఠ నీటిమట్టానికి మరో మీటరు దూరంలో హుస్సేన్ సాగర్‌లో నీరు ఉంది. ఎగువున కురుస్తున్న వర్షాలతో కూకట్‌పల్లి నాలాలో నుంచి సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. మరో రెండ్రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో అవసరమైతే తూముల ద్వారా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి: ఇవీ చదవండి: భద్రాచలం వద్ద గోదారమ్మ ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
ECET Postponed: ఎల్లుండి జరగాల్సిన ఈసెట్ వాయిదా.. ఎంసెట్ యథాతథం
సీనియర్లు, జూనియర్ మధ్య వాగ్వాదం.. పదో తరగతి విద్యార్థి మృతి