హైదరాబాద్ జీడిమెట్లలోని చింతల్ ప్రాంతంలో ఓ భర్త పరాయి స్త్రీతో సహజీవనం చేస్తూ పట్టుబడ్డాడు. భద్రాది జిల్లా, సారెపాక ప్రాంతానికి చెందిన లావణ్యకు కృష్ణ జిల్లా, నరసరావు పాలెం ప్రాంతానికి చెందిన సుధాకర్(30) తో 2015 సంవత్సరంలో వివాహం జరిగింది. లావణ్య తల్లిదండ్రులు రూ.40 లక్షలు కట్నం ఇచ్చి సుధాకర్ తో వివాహం జరిపించారు. వీరికి ఓ పాప పుట్టింది. భార్యాభర్తలిద్దరు కలిసి విజయనగరం జిల్లాలోని ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా... తన భర్త సుధాకర్ 'చిన్నారి' అనే మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి 3 సంవత్సరాల క్రితం అతన్ని నిలదీయగా పారిపోయిన భర్త సుధాకర్ చింతల్ ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని చిన్నారితో సహజీవనం చేస్తున్నాడు.
లావణ్య తన భర్త సమాచారాన్ని బంధువుల సహాయంతో వెతుకుతుండగా సుధాకర్ పేరును సిద్దుగా పేరు మార్చుకొని చింతల్ ప్రాంతంలో చిన్నారీ అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడని తెలిసింది. వీరికి ఓ బాబు కూడా పుట్టాడని తెలుసుకొని నిన్న రాత్రి వీరిద్దరూ నివసిస్తున్న ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం జీడిమెట్ల పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: