తెరాస, మజ్లీస్ పార్టీల నాయకులు రౌడీలుగా ప్రవర్తిస్తూ బండి సంజయ్‌పై దాడికి యత్నించారని భాజపా నేతలు లక్ష్మణ్, డీకే అరుణ ఆరోపించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగం, పోలీసుల పక్షపాతం, ఎన్నికల కమిషన్ వైఫల్యాలను నిరసిస్తూ భాజపా రాష్ట్ర కార్యాలయంలో జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, అరుణ, మాజీ ఎంపీ వివేక్ ఉపవాస దీక్ష చేపట్టారు.
తండ్రీ కొడుకులు అధికార దుర్వినియోగంతో గెలువాలని చూస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. ఐటీ హబ్‌గా పేరు గాంచిన గ్రేటర్ నగరాన్ని తెరాస నాయకులు గల్లీ నగరంగా పోల్చారని పేర్కొన్నారు. ప్రజలు మాత్రం అన్ని విషయాలు గమనిస్తున్నారని.. హైదరాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: మేయర్