ఏపీ తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయం ముందు ఉన్న హుండీని ఒక దొంగ బయటకు తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి.
ఆలయానికి వెనక వైపున ఉన్న కొబ్బరితోటలో ధ్వంసమైన హుండీని స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు హుండీని ఆలయంలో ఉంచి పరిశీలించారు. అందులో సొమ్ము ఎంతపోయిందన్నదీ తెలియలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఆరోజు నగరంలోని పలుచోట్ల తాగునీటి సరఫరాకు అంతరాయం'