ETV Bharat / city

మార్చి నెలలో రికార్డు స్థాయిలో వసూలైన పన్నులు - telangana varthalu

రాష్ట్రంలో కొవిడ్, లాక్‌డౌన్‌ ప్రభావాల నుంచి బయటపడి... పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో జరిగాయి. మార్చి నెలలో గతేడాది మార్చిలో వచ్చిన రాబడితో పోలిస్తే రికార్డు స్థాయిలో 31.22శాతం పన్నుల రాబడి పెరిగిందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు.

huge tax collections in march
మార్చి నెలలో రికార్డు స్థాయిలో వసూలైన పన్నులు
author img

By

Published : Apr 7, 2021, 7:40 PM IST

రాష్ట్రంలో మార్చి నెలలో భారీగా పన్నులు వసూలయ్యాయి. గత ఏడాది మార్చిలో వచ్చిన రూ. 5017 కోట్లు రాబడితో పోలిస్తే ఈ మార్చిలో రికార్డు స్థాయిలో 31.22శాతం వృద్ధి నమోదు చేసి రూ.6583.24 కోట్లు వసూళ్లు అయినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. ఈ మార్చి నెలలో పెట్రోల్‌ అమ్మకాలపై వ్యాట్‌ రాబడిలో అంతకుముందు మార్చిలో వచ్చిన రూ.1523 కోట్లుతో పోలిస్తే భారీగా 38శాతం తరుగుదల నమోదై కేవలం రూ.943.58 కోట్లు వచ్చింది. అదే మద్యం అమ్మకాలపై వ్యాట్‌ రాబడుల్లో గత మార్చిలో రూ.880 కోట్లు రాబడులు రాగా... ఈ సంవత్సరం ఏకంగా 36శాతం వృద్ధి నమోదు చేసి రూ.1200 కోట్లు రాబడి వచ్చింది.

జీఎస్టీ రాబడుల్లో గత మార్చిలో రూ.2614 కోట్లు రాబడి రాగా... ఈ సంవత్సరం అదే నెలలో రూ.3,230.03 కోట్లు వచ్చి ఏకంగా 24శాతం వృద్ధి నమోదు చేసినట్లు వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులతో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరం సగటున పది శాతం వృద్ధి సాధించినట్లు వాణిజ్య పన్నుల శాఖ తెలిపింది. కరోనా, లాక్‌డౌన్‌ ప్రభావాలను అధిగమించి పన్నుల వసూళ్లు జరిగాయని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: తడి నయనాలతో... ఊరు ఖాళీ అయింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.