ETV Bharat / city

HYDERABAD METRO: చాలా రోజుల తర్వాత కిక్కిరిసిన మెట్రో బోగీలు

author img

By

Published : Aug 22, 2021, 10:43 PM IST

చాలారోజుల తర్వాత హైదరాబాద్​ మెట్రో ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. రాఖీపండగ, ఆదివారం కావడంతో అన్నిమెట్రో కోచ్​లు కళకళలాడాయి. సుమారుగా ఆదివారం ఒక్కరోజే 3 లక్షల మంది ప్రయాణించి ఉంటారని అంచనా.

hyderabad metro
hyderabad metro

హైదరాబాద్​ మెట్రోరైలు చాలా రోజుల తర్వాత ప్రయాణికులతో కళకళలాడింది. రాఖీ పండగ కావడంతో ఆదివారం కిక్కిరిసిపోయింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు సోదరి, తోబుట్టువు ఇంటికి వెళ్లేందుకు సోదరులు.. మెట్రోని ఎంచుకోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కన్పించింది.

ప్రత్యేకించి మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్, నాగోల్‌ నుంచి రాయదుర్గం మార్గాల్లో ప్రతి ట్రిప్పులోనూ ప్రయాణికులు భారీగా రాకపోకలు సాగించారు. ప్రారంభ స్టేషన్లు నాగోల్, ఉప్పల్, మియాపూర్, ఎల్‌బీనగర్‌లోనే మెట్రో సీట్లు నిండిపోయేవి. ఆ తర్వాత ఎక్కిన వారంతా నిలబడే ప్రయాణించాల్సి వచ్చింది. ఆదివారం ఒక్కరోజే దాదాపు 3 లక్షల వరకు ప్రయాణించి ఉంటారని అంచనా. కొవిడ్‌ తర్వాత ఇదే అత్యధిక ప్రయాణికుల సంఖ్య.

రోజువారీ దాదాపుగా 2 లక్షల మంది వరకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రయాణికుల సంఖ్య సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. శని, ఆదివారాలు తక్కువగా ఉంటుంది. రాఖీ పండగ కావడంతో తోబుట్టువుల ఇళ్లకు చేరుకునేందుకు నగరవాసులు మెట్రోని ఎంపిక చేసుకున్నారు. మహిళలు, పిల్లలు, యువతీయువకులు ఎక్కువగా మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్​లో కొవిడ్‌ తర్వాత ఈ స్థాయిలో ప్రయాణికులతో సందడి నెలకొనడం ఇదే మొదటిసారి అని అక్కడ స్టాల్స్‌ యాజమానులు అంటున్నారు. ఆర్టీసీ బస్సులు పలు రూట్లలో రద్దీగా కన్పించాయి.

ఇదీచూడండి: 'అది తప్పుడు ప్రచారం.. చలానా పెండింగ్​ ఉంటే వాహనాలు జప్తు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.