ETV Bharat / city

బల్దియా బరిలో.. ఓటు ఓటుకూ.. చేతులు మారే నోటు!

హైదరాబాద్​ నగరంలోని అనేక డివిజన్లలో కరెన్సీ కట్టలు తెగుతున్నాయి. కొన్నిచోట్ల ఎన్నికలకు వారం ముందు నుంచే ఓటర్లపై పట్టున్న నాయకులను కొనుగోలు చేసే ప్రక్రియను పార్టీలు ప్రారంభించాయి. 20 నుంచి 100 ఓట్లను వేయించే సామర్థ్యం ఉన్న గల్లీ నాయకులకు వారు కోరుకున్నట్లు కరెన్సీ గానీ ఖరీదైన బహుమానం గాని అందుతోంది. ఇప్పటి నుంచే డబ్బుల పంపిణీ మొదలైందంటే పోలింగ్‌ పూరయ్యేనాటికి రూ.కోట్లలోనే చేతులు మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

author img

By

Published : Nov 25, 2020, 9:57 AM IST

huge money distribution in ghmc elections 2020
బల్దియా బరిలో.. ఓటు ఓటుకూ.. చేతులు మారే నోటు

ల్దియా ఎన్నికలు డిసెంబరు 1న 150 డివిజన్లలో జరగనున్నాయి. మొత్తం 74 లక్షల పైచిలుకు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలో 5-10 డివిజన్ల వరకు ఉన్నాయి. ఇంతవరకు ఏ గ్రేటర్‌ ఎన్నికలోనూ దాదాపు 45 శాతానికి మించి పోలింగ్‌ జరగలేదు. వివిధ కారణాల వల్ల ఈదఫా కూడా ఓటింగ్‌ తక్కువ నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రతి ఓటుకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.

అందరిదీ అదే లక్ష్యం..

అధికార తెరాస గత ఎన్నికల్లో మాదిరిగానే ఫలితాలు సాధించి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఇక భాజపా విషయానికొస్తే దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల ఫలితం తమకు అనుకూలంగా రావడంతో బల్దియాలో బలాన్ని ప్రదర్శిస్తే భవిష్యత్తులో పార్టీ బలోపేతం కావడానికి ఉపకరంగా ఉంటుందని భావిస్తోంది. మొన్నటి బల్దియా ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి మరికొన్ని స్థానాలను పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎంఐఎం పాతబస్తీలోనే కాకుండా ఇతర డివిజన్లలోనూ జెండా ఎగుర వేయాలని లక్ష్యం పెట్టుకొంది. కొన్ని స్థానాల్లో తెలుగుదేశం కూడా పోటీని ఇస్తోంది. అన్ని పార్టీలు ప్రతి ఓటునూ కీలకంగా భావిస్తున్నాయి. స్థానికంగా పట్టున్న నాయకులను గుర్తించి పలు పార్టీలు వారికి ముందుగానే డబ్బు ఇస్తున్నాయి. వారి ఆధ్వర్యంలోనే ఒకటి రెండు రోజుల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయాలని తలపోస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలపైనా వల విసిరి మచ్చిక చేసుకుంటున్నాయి.

భారీ నివాస సముదాయాలకు వెళ్లి..

కొన్ని గేటెడ్‌ కమ్యూనిటీల్లోనూ, పెద్ద అపార్టుమెంట్లలోనూ వారికి కావాల్సిన వస్తువుల కొనుగోలుకు రూ.లక్షల్లో డబ్బులు ఇస్తున్నారు. కూకట్‌పల్లిలో ఓ అపార్టుమెంట్‌ వారికి తాగునీటి కనెక్షన్‌ సామర్థ్యం పెంచుకోవడానికి రూ.4.5 లక్షల వ్యయమవుతుందని అంచనావేశారు. ప్రచారానికి వచ్చిన ఓ నేత ఆ డబ్బును అసోసియేషన్‌ పెద్దలకు అందజేశారు. నివాసితులతో సమావేశం పెట్టి డబ్బు తీసుకున్న పార్టీకే ఓట్లు వేయాలంటూ ఒప్పించినట్లు తెలిసింది. రెండో దశ కింద ఓటర్లకు రూ.200 నుంచి రూ.2000 వరకు అందించడానికి కొందరు నేతలు సిద్ధం చేసుకుంటున్నారు.

హవాలా హవా!

గ్రేటర్‌ ఎన్నికల్లోనూ హవాలా దందా నడుస్తోంది. నేరుగా డబ్బు పంపించకుండా ఎక్కడికక్కడే సర్దుబాటు చేసే వ్యవస్థీకృత నేర ప్రక్రియనే హవాలాగా పరిగణిస్తుంటారు. రూ.కోట్ల సొమ్మునూ నిమిషాల్లోనే అవతలి వ్యక్తులకు అందజేయడం ప్రత్యేకత. రెండు రోజుల క్రితమే నగరంలో సుమారు రూ.25లక్షల హవాలా సొమ్ము చిక్కడం చర్చనీయాంశమైంది. నేతలకు హవాలా వ్యాపారులతో ఎక్కువగా పనిపడేది ఎన్నికల సమయంలోనే. 2014 సాధారణ ఎన్నికల్లో ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే రూ.21.35కోట్ల సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.8.33 కోట్లను హవాలా సొమ్ముగా గుర్తించారు.

కమీషన్‌తో సొమ్ముకు రెక్కలు

హైదరాబాద్‌లో హవాలా దందా విషయానికొస్తే టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌వోటీ పోలీసులకు ఠక్కున గుర్తుకొచ్చేది బేగంబజార్‌, ఆబిడ్స్‌, రాణిగంజ్‌, మార్కెట్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ వంటి వాణిజ్య ప్రాంతాలు. రూ.లక్ష నగదు బదిలీకి కమీషన్‌ కింద రూ.600ను హవాలా వ్యాపారులు వసూలు చేస్తారు. హవాలా మార్గంలో సొమ్మును తరలిస్తూ పోలీస్‌లకు చిక్కితే దానిని ఆదాయ పన్ను(ఐటీ) శాఖకు అప్పగిస్తారు. అనంతరం న్యాయస్థానంలో డిపాజిట్‌ చేస్తారు.ఆ సొమ్ము మూలాల గురించి ఐటీ శాఖకు సరైన ఆధారాలు చూపించకపోతే జరిమానా విధిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.