ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని ఎస్సీ కాలనీలో డీఎస్పీ రాఘవరెడ్డి నేతృత్వంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ట్రెజరీ ఉద్యోగి మనోజ్ ఇంట్లో భారీగా ఆయుధాలు, బంగారం, వెండి ఉందని ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు.. ఆ ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేశారు. మొత్తం 8 ఇనుప పెట్టెలను గుర్తించిన పోలీసులు.. ఒక పెట్టెను తెరచి చూడగా.. అందులో ఓ ఎయిర్ పిస్టల్‌తో పాటు వెండి వస్తువులు లభ్యమయ్యాయి. రెండో పెట్టెలో నగదు బయటపడింది. ముగ్గురు డీఎస్పీలు, తహసీల్దార్, రెవెన్యూ అధికారుల సమక్షంలో వెండి, నగదును లెక్కిస్తున్నారు. మిగిలిన పెట్టెల్లోనూ భారీగా బంగారం, వెండి నిల్వలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
భారీ బందోబస్తు
ముందు జాగ్రత్త చర్యగా ఎస్సీ కాలనీలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. కాలనీలోకి బయట వ్యక్తులను ఎవర్నీ రానివ్వడం లేదు. అలాగే ఆ ఇంటి వద్దకు మీడియాతో పాటు స్థానికులను కూడా అనుమతించడం లేదు. కాలనీలో ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రాకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదీ చూడండి..
మాజీ ప్రియుణ్ని చంపి.. రూ.12 లక్షలు తీసుకుని మరొకరితో వెళ్లిపోయింది..!