మేషం :
శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవ బలం విశేషంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
వృషభం :
ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. నవ గ్రహ శ్లోకాలు చదవాలి.
మిథునం :
సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చుపెట్టాలి. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.
కర్కాటకం :
సమయానుకూలంగా ముందుకు సాగాలి. ఆలోచనలే పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం వల్ల మంచి జరుగుతుంది.
సింహం :
ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనోధైర్యం కలిగి ఉంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మనో విచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. గురు శ్లోకం చదవాలి.
కన్య :
చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. విష్ణు నామస్మరణ ఉత్తమం.
తుల :
వృత్తి, వ్యాపారాల్లో మధ్యమ ఫలితాలున్నాయి. స్థిర చిత్తంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. ఆవేశాలకు పోకూడదు. నవ గ్రహ శ్లోకాలు చదివితే మంచిది.
వృశ్చికం :
మనో ధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాటాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి కలదు. గణపతి సందర్శనం మంచినిస్తుంది.
ధనస్సు :
కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థాన చలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివ నామాన్ని జపించాలి.
మకరం :
ముఖ్య విషయాల్లో పెద్దల సహకారం తీసుకోవడం ఉత్తమం. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. శని ధ్యానం శుభప్రదం.
కుంభం :
నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలక చర్చలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
మీనం :
కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్దకాన్ని దరిచేరనీయకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.