ETV Bharat / city

'బిల్లులు పెండింగ్‌లో ఉండగా రాజధాని ఎలా తరలిస్తారు?' - రాజధాని తరలింపుపై హైకోర్టు ప్రశ్న

బిల్లులు పెండింగ్‌లో ఉండగా రాజధాని ఎలా తరలిస్తారని ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ చట్టం రద్దు బిల్లులు శాసనవ్యవస్థ వద్ద పెండింగ్‌లో ఉన్న విషయం ప్రస్తావించింది. అలాగే ఆ బిల్లులపై వ్యాజ్యాలు హైకోర్టులో అపరిష్కృతంగా ఉన్న అంశాన్నీ గుర్తుచేసింది. ప్రమాణపత్రం దాఖలుకు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

excutive capital vishaka news
'బిల్లులు పెండింగ్‌లో ఉండగా రాజధాని ఎలా తరలిస్తారు?'
author img

By

Published : Apr 25, 2020, 6:13 AM IST

అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించే చర్యలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ... అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు వేసిన పిల్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖకు తరలించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్‌ అభ్యర్థనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేసింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఉన్నం మురళీధరరావు... కార్యనిర్వాహక రాజధానిని ఆకస్మాత్తుగా విశాఖకు తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మార్చి నెలలో నిర్వహించిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో మే నెలాఖరుకు రాజధానిని విశాఖకు తరలించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారని ప్రస్తావించారు. రాజధాని తరలింపుపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... పాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ చట్టం రద్దు బిల్లులు శాసనవ్యవస్థ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై హైకోర్టులో వ్యాజ్యాలు ఇంకా పరిష్కారం కాలేదని గుర్తుచేసింది. ఇలాంటి సమయంలో అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు ఎలా తరలిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

దీనిపై స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్... బిల్లులు పెండింగ్‌లో ఉన్న మాట నిజమేనన్నారు. రాజధాని తరలింపుపై ప్రభుత్వం ఉత్తర్వులేమీ ఇవ్వలేదని చెప్పారు. దీనిపై పూర్తి వివరాలతో 10 రోజుల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్‌ వేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అంతలోపు రాజధాని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు సూచించింది.

ఇళ్ల స్థలాల జీవోపైనా...

అమరావతి పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా సీఆర్​డీఏ బృహత్ ప్రణాళిక, నిబంధనల్లో మార్పు చేస్తూ ప్రభుతం జారీ చేసిన జీవో 131, ఇళ్ల ఎంపికపై ఇచ్చిన జీవో 99పై దాఖలైన పిల్‌పైనా 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీవో 131, జీవో 99ని సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి

టెలీ మెడిసిన్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయండి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.