ETV Bharat / city

corona cases: కరోనా తొలినాళ్లలో ఒకలా.. సెకండ్​ వేవ్​లో మరోలా

author img

By

Published : Jun 29, 2021, 7:49 PM IST

కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఏప్రిల్, మే నెలల్లో కేసుల సంఖ్య బాగా పెరిగినా.. లాక్​డౌన్, ప్రజల అప్రమత్తతతో క్రమంగా తగ్గాయి. అయితే ఇప్పటికీ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలపై మాత్రం కరోనా మహమ్మారి పట్టు సడలించినట్టు కనిపించటం లేదు. గత వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 43 శాతానికిపైగా కేసులు ఆ ఎనిమిది జిల్లాలోనే కావటం గమనార్హం. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో నిత్యం భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా ప్రభలుతున్న జిల్లాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

corona cases in telangana
corona cases in telangana

రాష్ట్రంలో కరోనా మొదటి కేసు నమోదైన తొలినాళ్లలో కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. మర్కజ్ యాత్ర నేపథ్యంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. అనంతరం జీహెచ్​ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలపైనే మహమ్మారి అధిక ప్రభావం చూపింది. పట్టణ ప్రాంతాలు కావటం, ఉపాధి సహా అనేక కారణాలతో ఆయా జిల్లాలకు పెద్దఎత్తున ప్రజలు రాకపోకలు సాగించడం వల్ల వైరస్​ విజృంభణ అధికంగా ఉండేది.

సెకండ్​ వేవ్​లో తీరు మారింది..

అయితే రెండో దశకు వచ్చేసరికి తీరు మారింది. సరిహద్దు జిల్లాలపై మహమ్మారి పంజా విసిరింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రా ప్రాంతాల నుంచి రాకపోకలు అధికంగా సాగే సరిహద్దు జిల్లాల్లో కొవిడ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఏప్రిల్, మే నెలలో వైరస్​ విలయతాండవం చేయడం వల్ల సర్కారు కట్టడి చర్యలు చేపట్టింది. లాక్​డౌన్​ సహా కట్టుదిట్టమైన నిబంధనలు అమలుచేసింది. ఫలితంగా జూన్ మొదటి నుంచే కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజుల నుంచి వెయ్యిలోపే కరోనా కేసులు నమోదవుతుండడం కొంత ఊరట కలిగిస్తోంది.

పలు జిల్లాల్లో ఇంకా ప్రభావం..

ప్రభుత్వ చర్యలు నేపథ్యంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య స్వల్పంగా ఉండటం హర్షించాల్సిన విషయం. అయినా.. పలు జిల్లాల్లో కొవిడ్​ ప్రభావం ఇంకా తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు సంఖ్యలో పెద్దగా తగ్గుదల కనిపించటం లేదని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. మరో ఏడు జిల్లాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది.

43 శాతానికి పైగా ఆ జిల్లాల్లోనే..

గడచిన వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 7,207 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో సూర్యాపేట, పెద్దపల్లి, నల్గొండ, మంచిర్యాల, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనే ఏకంగా 3,161 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్న విషయం. అంటే గత వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 43.86 శాతం కేసులు ఆ ఎనిమిది జిల్లాల పరిధిలోనివే. మరీ ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే అధిక సంఖ్యలో కరోనా వెలుగు చూస్తున్న నేపథ్యంలో.. ఆయా ప్రాంతాల్లో పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

లాక్​డౌన్​ ఎత్తివేత అనంతరం..

లాక్​డౌన్​ ఎత్తేసిన తర్వాత.. శుభకార్యాలు, సమూహాలుగా ఏర్పడి చేస్తున్న అనేక కార్యక్రమాలు వైరస్​ వ్యాప్తికి కారణమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి వచ్చే వరకు ప్రతిఒక్కరూ స్వీయరక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీచూడండి: రాష్ట్రంలో 97.24 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.