Electricity Bill: ఏపీలోని సత్యసాయి జిల్లా హిందూపురంలో కరెంటు బిల్లును చూసి ఓ యజమాని షాక్కు గురయ్యాడు. 500 రూపాయలు వచ్చే బిల్లు ఇప్పుడు ఏకంగా 64 వేల రూపాయలు రావడంతో అతడు ఆందోళన చెందుతున్నాడు. హిందూపురం పట్టణంలోని ముక్కడిపేటకు చెందిన అబ్దుల్ తన ఇంటికి ప్రతినెల 500 రూపాయల చొప్పున విద్యుత్ బిల్లు వచ్చేదని తెలిపాడు. అయితే..ఏప్రిల్ నెల విద్యుత్ బిల్లు ఆకాశాన్నంటేలా 64 వేల 211 రూపాయలు రావడం చూసి అవాక్కయ్యానన్నాడు.
ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా దానిని పరిశీలించి, ఈ తప్పిదాన్ని సరి చేస్తామని హామీ ఇచ్చారు. వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా వచ్చే ఈ విద్యుత్ బిల్లుల తప్పిదాలను అధికారులు సత్వరమే సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: