ETV Bharat / city

బకాయిల సాకుతో ఆరోగ్య కార్డులు తిరస్కరిస్తున్న ఆస్పత్రులు - Environmental Health Services card users in telangana

వందల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయనే సాకుతో ఆరోగ్య కార్డులను చాలా వరకు కార్పొరేట్ ఆస్పత్రులు తిరస్కరిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లోనూ చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు తమకు లాభసాటిగా ఉన్న చికిత్సలనే ఈహెచ్​ఎస్​ కింద అందిస్తున్నాయి.

health cards, ehs cards, telangana health department
ఆరోగ్య కార్డు, ఈహెచ్​ఎస్ కార్డు, తెలంగాణ ఆరోగ్య శాఖ
author img

By

Published : Apr 5, 2021, 7:09 AM IST

రాష్ట్ర ప్రభుత్వం తమకు సకాలంలో నిధులు విడుదల చేయడం లేదని, రూ.వందల కోట్ల బకాయిలు పేరుకుపోయాయనే సాకుతో ఈహెచ్‌ఎస్‌ కార్డులను ‘నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డు ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌’ (ఎన్‌ఏబీహెచ్‌) అనుమతి పొందిన అత్యధిక కార్పొరేట్‌ ఆసుపత్రులు తిరస్కరిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లోనూ చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నాయి. 2017లో ప్రభుత్వం నూతన ధరలు ఖరారు చేసిన అనంతరం ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో విస్తృత సేవలందించారు.

2016-17 వరకూ ఏడాదికి 55 వేలకు పరిమితమైన కేసులు.. 2017-18లో 92 వేలు దాటాయి. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 2016-17లో 5 వేల చికిత్సలు అందించగా.. 2017-18లో అయిదింతలకు పైగా (27 వేలు) చేశారు. ఆ సంవత్సరంలో ఔషధ చికిత్సలకూ రూ.10-15 లక్షల బిల్లు వేసిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత నిధులు విడుదల కావడం లేదంటూ ఆరోగ్య కార్డులను కార్పొరేట్‌ ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. చికిత్సలు 2018-19లో 18 వేలకు, 2019-20లో 13 వేలకు తగ్గాయి. గత ఏడాది కొవిడ్‌ కారణంగా చేరికలు నిలిచిపోయాయి. 2020 సెప్టెంబరు నుంచి సాధారణ సేవలను అనుమతించినా.. ఈహెచ్‌ఎస్‌ కార్డుల కింద రోగులను చేర్చుకోవడం లేదు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందిన సందర్భంలో ఉన్నతాధికారులు తాత్కాలికంగా చొరవ చూపుతున్నా ఆసుపత్రుల తీరు యథావిధిగా మారుతోంది.

లాభసాటి అయితేనే..

కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు తమకు లాభసాటిగా ఉన్న చికిత్సలనే ఈహెచ్‌ఎస్‌ కింద అందిస్తున్నాయి. అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉన్నా.. గుండె రక్తనాళాల్లో స్టెంట్లు, మూత్రపిండాల్లో రాళ్లు, క్యాన్సర్‌కు రేడియేషన్‌.. తదితర చికిత్సలకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఏ ఆసుపత్రిలో ఏయే చికిత్సలు చేస్తున్నారనే అంశంపై అవగాహన లేక ఉద్యోగులు, పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారు. పథకం సజావుగా కొనసాగేలా ప్రత్యేక అధికారిని నియమించాలని కోరుతున్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడు(36) ‘సిస్టమిక్‌ లూపస్‌ ఎరిథమాటోసస్‌’ (ఎస్‌ఎల్‌ఈ)తో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులు, కాళ్లు చేతులు బలహీనపడటంతో పాటు ఊపిరి పీల్చుకోవడమూ కష్టమవుతుండడంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి వచ్చారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) కింద చేర్చుకోవడానికి ఆ ఆసుపత్రి నిరాకరించడంతో నగదు కట్టి చేరిపోయారు. దాదాపు 30 రోజులు చికిత్స పొందారు. బిల్లు రూ.8 లక్షలు కావడంతో భార్య, కుటుంబ సభ్యులు అందినచోటల్లా అప్పు చేసి చెల్లించారు.

ఈహెచ్​ఎస్ కింద చికిత్సలు ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.