ETV Bharat / city

First Night : తొలిరాత్రి భర్త ప్రవర్తన చూసి నవవధువు షాక్.. - తొలి రాత్రి వింత అనుభవం

అబ్బాయి మంచివాడని తల్లిదండ్రులు చెబితే సరేనని పెళ్లి చేసుకుంది. కోటి ఆశలతో కొత్త జీవితానికి స్వాగతం పలికింది. కానీ.. తొలిరాత్రి(First Night) తన భర్త ప్రవర్తన చూసి షాక్ అయింది. ఇంతకీ అతడేం చేశాడు? అతడి ప్రవర్తన చూసి నిర్ఘాంతపోయిన నవవధువు ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంది?

తొలిరాత్రి భర్త ప్రవర్తన చూసి నవవధువు షాక్

author img

By

Published : Jul 27, 2021, 9:19 AM IST

చూడటానికి చక్కగా ఉన్నాడు. పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అంటూ మాయ మాటలు చెప్పి సంసారానికి పనికిరాని వ్యక్తితో వివాహం చేసి తన జీవితాన్ని నాశనం చేశారంటూ బాధిత యువతి సోమవారం పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఆమె బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్​లోని​ నర్సరావుపేటకు చెందిన ఓ మహిళ తాడేపల్లిలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తోంది. తన కుమారుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి గుంటూరుకు చెందిన యువతితో మే 26న వివాహం జరిపించారు. కట్నంగా రూ. ఆరు లక్షలు, పెళ్లికి మరో రూ.రెండు లక్షలు ఖర్చు చేయించారు. తన కుమారుడి తొలిరాత్రి భువనేశ్వర్‌లో జరగాలని అత్త ఒత్తిడి చేసింది. అందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో నర్సరావుపేటలో ఏర్పాటు చేశారు. తొలిరాత్రి(First Night) రోజు యువకుడు వింత ప్రవర్తనలు, విచిత్ర ధోరణితో వ్యవహరించడంతో ఆ యువతి నిశ్చేష్టురాలైంది. ఆమె దగ్గరకు వచ్చిన అతను ఈ వయసులో కోరికలు ఎక్కువ ఉండకూడదంటూ మాత్ర వేసుకొని నిద్రపోయాడు.

అదే తరహాలో మూడు రాత్రులు(First Night) వ్యవహరించడంతో ఆమెకు అనుమానం వచ్చి నిలదీసింది. అప్పుడు అతను భార్య, భర్తలు అంటే శారీరక సంబంధం పెట్టుకోవడం కాదని.. మనం మంచి స్నేహితులుగా ఉందామనడంతో ఆమె నిర్ఘాంతపోయింది. ఆ రోజు తను మింగే మాత్రలు అయిపోయాయి. ఆ మాత్రలు వేసుకోకపోతే తలనొప్పి, నోటివెంట సొంగ పడుతుందన్నాడు. తనకు ఆరోగ్యం బాగోలేదు. మానసిక స్థితి సరిగాలేదంటూ తెలపడంతో విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. వాళ్లు వచ్చి అత్తను ప్రశ్నిస్తే తన కుమారుడు ఆరోగ్యవంతుడేనని, తలనొప్పికి మాత్రలు వేసుకుంటున్నాడు కావాలంటే తాము చికిత్స చేయించుకునే వైద్యుడిని అడగండంటూ జీజీహెచ్‌ పర్యవేక్షకులుగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన వైద్యులకు ఫోన్‌ ఇచ్చింది. ఆ యువతి వైద్యుడిని ప్రశ్నించగా ఆయన విస్తుపోయే వాస్తవాలు తెలిపారు.

ఆ యువకుడికి మానసిక స్థితి సరిగాలేదని, మాత్రలు వాడకపోతే ప్రమాదమని.. వ్యాధి తీవ్రమవుతుందని పేర్కొన్నారు. దీంతో ఆ యువతి, ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇన్ని విషయాలు మభ్యపెట్టి ఎందుకు పెళ్లి చేశారని తన అత్తను అడిగితే ఆమె గొడవపెట్టుకొని తమపై బెదిరింపులకు పాల్పడుతుందని వాపోయారు. దీనిపై నర్సరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన అత్తకు ఉన్న పరిచయాలతో కేసును తప్పుదోవ పట్టించడానికి యత్నిస్తుందని వాపోయారు. తనను మభ్యపెట్టి మానసిక రోగి, సంసారానికి పనికిరాని వ్యక్తితో వివాహం చేసి మోసగించిన అత్త, భర్త, పెళ్లిళ్ల మధ్యవర్తిపై క్రిమినల్‌ చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.