Constable Recovery: ఇటీవల జరిగిన మావోయిస్టు కాల్పుల్లో గాయపడ్డ కానిస్టేబుల్ను హోంమంత్రి మహమూద్ అలీతో పాటు డీజీపీ మహేందర్రెడ్డి పరామర్శించారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ మధుతో పాటు అతడి తల్లిదండ్రులతో మాట్లాడారు. కానిస్టేబుల్ మధు ఆరోగ్య పరిస్థితి, చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సాయం..
బుధవారం(జనవరి 19న) కానిస్టేబుల్ చేతికి శస్త్రచికిత్స చేసినట్టు వైద్యులు తెలిపారు. మధుకు ఛాతిలో దిగిన బుల్లెట్ తొలగించామన్నారు. ప్రస్తుతం మధు పరిస్థితి నిలకడగా ఉందని.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారన్నారు. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని హోంమంత్రికి వైద్యులు వివరించారు. కానిస్టేబుల్‌కు ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందజేస్తానని హోంమంత్రి కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.
కర్రెగుట్టు ఎన్కౌంటర్లో..
ములుగు జిల్లాలోని కర్రెగుట్టలో జరిగిన మావోయిస్టుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా.. గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మధుకు గాయాలయ్యాయి. ఈ కాల్పుల్లో మధు చేతి వేళ్లు తెగిపోగా... ఛాతిలో బుల్లెట్ దిగింది. మధును హుటాహుటిన హెలికాప్టర్లో హనుమకొండకు తరలించి... ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తరలించారు. మధుతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా వారికి చికిత్స అందించారు.
సంబంధిత కథనాలు..