ETV Bharat / city

ఏపీ విద్యావ్యవస్థలో 'స్వేచ్ఛ'.. దేశానికే ఆదర్శం: సుచరిత

బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే లక్ష్యంగా ప్రారంభించిన 'స్వేచ్ఛ' కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలవనుందని ఏపీ హోంశాఖ మంత్రి సుచరిత అన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు శానిటరీ న్యాప్‌కిన్లు పంపిణీ చేశారు.

minister sucharita
minister sucharita
author img

By

Published : Oct 5, 2021, 3:41 PM IST

ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు చదవే విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు అందించేలా ప్రభుత్వం రూపొందించిన 'స్వేచ్ఛ' కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలవనుందని ఏపీ హోంశాఖ మంత్రి సుచరిత అన్నారు. గుంటూరు స్తంభాలచెరువు పురపాలక పాఠశాలలో 'స్వేచ్ఛ' కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు శానిటరీ న్యాప్‌కిన్లు పంపిణీ చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే ఆడపిల్లలు.. అక్కడ మరుగుదొడ్లు సౌకర్యం లేకపోవడం వల్ల డ్రాపౌట్ అయ్యేవారన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న భరోసాతో ప్రస్తుతం ఆ పరిస్థితి ఎంతగానో మారిందన్నారు. 'నాడు-నేడు' కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలల్లోనూ బాలికలకు మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. 'స్వేచ్ఛ' కార్యక్రమం ద్వారా ఏటా ప్రతి విద్యార్థినికి 120 శానిటరీ న్యాప్‌కిన్లను రాష్ట్రప్రభుత్వం అందించనుందని హోంమంత్రి తెలిపారు.

ఇదీ చూడండి: AP CM Jagan about swechha program: 'బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే 'స్వేచ్ఛ' లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.