తమిళనాడులో వరుణుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే మరోమారు తమిళనాడుకు వర్ష ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైతో పాటు రామనాథపురం, తూత్తికుడి, శివగంగ సహా 12 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తూత్తికూడి, చెంగల్పట్టు, తెన్‌కాశీ, తిరునల్వేలీ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నాలుగు జిల్లాల్లో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తూత్తికూడి ఎయిర్‌పోర్ట్‌కు విమాన రాకపోకలు నిలిపివేశారు.