Medaram Jatara: మేడారం జాతర సందర్భంగా వరంగల్, పెద్దపల్లి జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలు, స్థానిక సంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. బ్యాంకులు మాత్రం తెరిచే ఉంటాయని ఆయా జిల్లాల కలెక్టర్లు స్పష్టం చేశారు. రేపు సెలవు సందర్భంగా మార్చి 12(రెండో శనివారం)వ తేదీన వర్కింగ్ డే ఉంటుందని పేర్కొన్నారు.
Medaram Jathara 2022: మేడారం జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మేడారానికి చేరుకున్న భక్తులు మొదట జంపన్న వాగు వద్దకు చేరుకుంటున్నారు. కల్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించి స్నానాలు ఆచరిస్తున్నారు. కొంతమంది భక్తులు జల్లు స్నానాలు చేస్తుండగా.. మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి వాగులో పసుపుకుంకుమలు వేసి పూజలు చేసి పుణ్యస్నానాలు చేస్తున్నారు. అక్కడి నుంచి అమ్మవార్ల దర్శనానికి తరలివెళ్తున్నారు.
ఇదీ చూడండి: జనమయమైన జంపన్న వాగు.. పుణ్యస్నానాలతో పునీతులవుతున్న భక్తులు..