ETV Bharat / city

ట్యాంక్​బండ్​ మరింత అందంగా.. ప్రణాళిక సిద్ధం చేస్తున్న హెచ్​ఎండీఏ - నడకదారి

హైదరాబాద్​కు అందాల మణిహారం హుస్సేన్ సాగర్​ను మరింత శోభాయమానంగా అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ట్యాంక్‌బండ్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే రూ.14.5 కోట్లతో ట్యాంక్​బండ్​పై ఫుట్​పాత్​ల అభివృద్ధి పనులు చేపట్టింది. 14 కిలోమీటర్ల మేర నడక దారి, ఓపెన్‌ జిమ్‌, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టు కోసం టెండర్లను పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

hmda Planning For Beautification on Tankbund
ట్యాంక్​బండ్​ మరింత అందంగా.. ప్రణాళిక సిద్ధం చేస్తున్న హెచ్​ఎండీఏ
author img

By

Published : Sep 27, 2020, 11:48 PM IST

హైదరాబాద్ అంటే మొదటగా గుర్తొచ్చేది చార్మినార్, రామోజీపిల్మ్ సిటీ, హుస్సేన్ సాగర్ తదితర ప్రాంతాలు. ఇటీవల ఈ జాబితాలో దుర్గంచెరువు తీగల వంతెన కూడా చేరింది. అయితే ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్​ వచ్చిన వారు హుస్సేన్ సాగర్​ను చూడకుండా మాత్రం తిరిగిపోరు. నగరం నడిబొడ్డులో ఉండటం, మెట్రో, బస్సు, ఎంఎంటీఎస్, ప్రైవేట్​, క్యాబ్​ సౌకర్యాలు అందుబాటులో ఉండటం వల్ల నగర ప్రజలు, పర్యాటకులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చి.. సేద తీరుతుంటారు. ఆ చుట్టుపక్కల ఉండే పీవీఆర్​, ఎన్టీఆర్​ పార్క్​, నెక్లెస్​ రోడ్డు వంటి ప్రదేశాలు నిత్యం పర్యాటకులు, యువత, నగర ప్రజలు కాలక్షేపం కోసం వస్తుంటారు.

ట్యాంక్​బండ్​ మరింత అందంగా.. ప్రణాళిక సిద్ధం చేస్తున్న హెచ్​ఎండీఏ

పర్యాటక హంగులు అద్దుతున్నారు..

హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు 1563లో హుస్సేన్‌సాగర్‌ను తవ్వించారు. దీనిపై రాకపోకలకు వీలుగా 1946లో ట్యాంక్‌బండ్‌ రోడ్డు విస్తరణ చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ హయాంలో హుస్సేన్​సాగర్​కు పర్యాటక సొబగులద్దారు. వాటర్​ ఫౌంటెయిన్లు, విద్యుద్దీపాలు, బుద్ధ విగ్రహం, మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనాలకు క్రేన్లు, భారీ వాహనాలు ట్యాంక్​బండ్ పైకి రావడం వల్ల ఫుట్​పాత్​లు దెబ్బతిని ప్రమాదకరంగా మారాయి. ట్యాంక్​బండ్ పై కూర్చొని సేద తీరేందుకు కూడా తగు సౌకర్యాలు లేక సందర్శకులు ఇబ్బందులు పడేవారు. ఈ తరుణంలోనే ట్యాంక్‌బండ్‌కు మరిన్ని పర్యాటక హంగులు అద్దేందుకు హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. అందులో భాగంగా మొదట హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ఫుట్​పాత్​లను అభివృద్ధి చేస్తోంది. దీనికి సంబంధిచిన పనులు యుద్ధ ప్రాతిపాదికన సాగుతున్నాయి.

మొదలైన సుందరీకరణ పనులు..

హెచ్‌ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి రూ.14.2 కోట్ల అంచనా వ్యయంతో ఫుట్​పాత్​ నిర్మాణ పనులు చేపట్టారు. హుస్సేన్ సాగర్ చుట్టూ కాలిబాటలు, సైకిల్ ట్రాక్​లు నిర్మించేందుకు త్వరలో టెండర్లు పిలువనున్నారు. సందర్శకులు సేదతీరేలా పెవిలియన్స్‌, బెంచీలు ఏర్పాటు చేయనున్నారు. రంగురంగుల పూలు, అలంకరణ మొక్కలతో సుందరీకరించనున్నారు. అత్యాధునిక వసతులతో కూడిన మరుగుదొడ్లను ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. ట్యాంక్​బండ్​పై ఇప్పటి వరకు ఉన్న విగ్రహాలతో పాటు తెలంగాణ చరిత్రకు అద్దంపట్టే సంస్కృతి, మహనీయుల శిల్పాలను పెట్టనున్నారు. సాగర్‌ చుట్టూ 360 డిగ్రీల కోణంలో నెక్లెస్‌రోడ్డు మీదుగా నడక దారిని అభివృద్ధి చేయనున్నారు. మరోవైపు నెక్లెస్ రోడ్డుకు కూడా కొత్త రోడ్లు వేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాగా రెండోవైపు పనులు సాగుతున్నాయి. నెక్లెస్ రోడ్డుపై బైక్ రేస్​లు నిర్వహించకుండా.. అడుగడుగున స్పీడ్​ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. పర్యాటకుల కోసం ట్యాంక్​బండ్ లోపల ఐలాండ్ ఏర్పాటు చేశారు.

ఆత్మహత్యలు ఉండకుండా..

హుస్సేన్ సాగర్​లో దూకి ఇప్పటి వరకు చాలామంది నిత్యం ఆత్మహత్యకు ప్రయత్నించేవారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. లేక్​ పోలీసులు ఎంతోమందిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నెక్లెస్ రోడ్డులోని హుస్సేన్​ సాగర్​ లోపలి వైపు ఏపుగా పెరిగిన చెట్లలో దాక్కుని పోలీసులకు కనిపించకుండా ఆత్మహత్యకు పాల్పడేవారు. తాజాగా బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ ఆ చెట్లను తొలగించేందుకు ముందుకొచ్చింది. ఆ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. దీనిద్వారా ఆత్మహత్యకు పాల్పడేవారు ఎంతదూరం నుంచైనా కనిపించే అవకాశం ఉంది. ట్యాంక్​బండ్​లోకి ఎవరూ దూకకుండా కంచె ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.

ఇదీ చూడండి: నగరాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతాం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.